ALLU ARJUN: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్పగా చిత్తూరు యాసతో హిట్ కొట్టాడు. పుష్ప 2తో కూడా పాన్ ఇండియాని షేక్ చేయబోతున్నాడు. అలాంటి తను సడన్‌గా నైజాం యాసకి షిఫ్ట్ అవుతున్నాడు. కారణం త్రివిక్రమ్ కొత్త సినిమా నేపథ్యం పూర్తిగా నైజాం కావడమే. అరవింద సమేత వీరరాఘవ రాయల సీమ బ్యాక్ డ్రాప్‌లో తీస్తే.. ఇప్పుడు తెలంగాణ నేపథ్యం ఎంచుకున్నాడు త్రివిక్రమ్. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కే ఈ ఫ్యామిలీ డ్రామాలో హీరో మరీ క్లాస్ రోల్‌లో కనిపిస్తాడట.
Nayanthara: వంద కోట్లు ఇస్తా వస్తావా.. దొబ్బేయ్ రా.. నయన డోంట్ కేర్ ఆన్సర్
విచిత్రం ఏంటంటే తెలంగాణ యాస రఫ్‌గా ఉంటుందంటారు. కాని ఆ యాసలో హీరోని సాఫ్ట్‌గా చూపించబోతున్నాడట గురూజీ. గతంలో రుద్రమదేవి మూవీలో తెలంగాణ యాసలో పంచ్ డైలాగ్స్ విసిరిన అల్లు అర్జున్.. ఈసారి పూర్తి స్థాయి పాత్రలో తెలంగాణ యాసతో డైలాగ్స్ విసరబోతున్నాడు. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురంలో ఈ మూడింట్లో హీరో పాత్ర ఒకలా ఉంటే, కొత్త పాన్ ఇండియా సినిమాలో నెక్ట్స్ లెవల్‌లో ఉండనుంది. అపరిచితుడులో హీరో పాత్ర స్థాయిలో సాఫ్ట్‌నెస్‌ని ఊహించలేం కాని, ఆ పాత్ర ప్రేరణతో త్రివిక్రమ్ ఏదో మ్యాజిక్ చేయబోతున్నాడట.
బ్రాహ్మిణ్ పాత్రలో, తెలంగాణ యాసలో అల్లు అర్జున్ ఈసారి చిత్ర విచిత్ర ప్రయోగానికి సిద్ధమయ్యాడు. డీజేలో బ్రాహ్మణ పాత్రవేసిన బన్నీ, రుద్రమదేవిలో తెలంగాణ యాసలో డైలాగ్స్ చెప్పాడు. ఇప్పుడు ఈ రెండు కలిపి త్రివిక్రమ్ మూవీలో మ్యాజిక్ చేయబోతున్నాడు.