National Film Awards: జాతీయ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్.. సత్తా చాటిన ఆర్ఆర్ఆర్, పుష్ప.. 69వ జాతీయ ఫిలిం అవార్డుల ప్రకటన..

పుష్ప చిత్రంతో ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. గంగూబాయి కతియావాడి చిత్రంలో నటించిన అలియా భట్‌తోపాటు, మిమి చిత్రానికిగాను కృతి సనన్ సంయుక్తంగా ఉత్తమ నటులుగా ఎంపికయ్యారు.

  • Written By:
  • Updated On - August 24, 2023 / 07:34 PM IST

National Film Awards: 2021కిగాను, 69వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు సినిమాలు సత్తా చాటాయి. తెలుగు సినిమాలకు ఈసారి అవార్డుల పంట పండింది. పుష్ప చిత్రంతో ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. గంగూబాయి కతియావాడి చిత్రంలో నటించిన అలియా భట్‌తోపాటు, మిమి చిత్రానికిగాను కృతి సనన్ సంయుక్తంగా ఉత్తమ నటులుగా ఎంపికయ్యారు. ఉత్తమ తెలుగు చిత్రంగా ఉప్పెన నిలిచింది. ఆర్ఆర్ఆర్, పుష్ప సహా తెలుగు సినిమాలకు అవార్డులు దక్కాయి. 69 ఏళ్ల జాతీయ అవార్డుల్లో తెలుగు నటుడికి ఉత్తమ నటుడి అవార్డు దక్కడం ఇదే తొలిసారి. ఈ ఘనతను అల్లు అర్జున్ సాధించారు. బెస్ట్ ఫీచర్ ఫిలింగా హిందీ చిత్రం రాకెట్రీ: ద నంబి ఎఫెక్ట్ నిలిచింది.
తెలుగు సినిమాకు సంబంధించి పుష్ప చిత్రానికి సంగీతం అందించిన దేవి శ్రీ ప్రసాద్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎంపికయ్యాడు. అలాగే ఎంఎం కీరవాణికి ఆర్ఆర్ఆర్ చిత్రానికిగాను బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అందించినందుకు బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఫర్ బీజీఎం అవార్డు దక్కింది. ఒకేసారి ఇద్దరు తెలుగు సంగీత దర్శకులకు అవార్డు దక్కింది. ఆర్ఆర్ఆర్‌లో కొమరం భీముడో ఆలపించిన కాలభైరవకు ఉత్తమ మేల్ సింగర్‌గా, ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు పాటకు కొరియోగ్రఫీ చేసిన ప్రేమ్ రక్షిత్‌కు ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా, ఆర్ఆర్ఆర్ చిత్రానికి స్టంట్స్ సమకూర్చిన సొలొమన్‌కు ఉత్తమ స్టంట్ మాస్టర్/యాక్షన్ డైరెక్టర్‌గా, ఆర్ఆర్ఆర్ చిత్రానికి విజువల్ ఎఫెక్ట్స్ అందించిన శ్రీనివాసన్‌కు బెస్ట్ వీఎఫ్ఎక్స్ డైరెక్టర్‌గా అవార్డ్ దక్కింది. అలాగే కొండపొలం చిత్రంలోని పాటలకుగాను రచయిత చంద్రబోస్‌కు బెస్ట్ పాటల రచయితగా అవార్డ్ దక్కింది. బెస్ట్ పాపులర్ ఫిలింగా ఆర్ఆర్ఆర్ నిలిచింది. ఆర్ఆర్ఆర్ చిత్రానికి ఆరు అవార్డులు దక్కాయి. పుష్ప చిత్రానికి రెండు అవార్డులు దక్కాయి.
69వ జాతీయ అవార్డుల వివరాలివి

ఉత్తమ చిత్రం: రాకెట్రీ: ద నంబి ఎఫెక్ట్ (హిందీ)
ఉత్తమ నటుడు: అల్లు అర్జున్ (పుష్ప)
ఉత్తమ నటి: అలియా భట్ (గంగుబాయి కతియావాడి), కృతి సనన్ (మిమి)
ఉత్తమ దర్శకుడు: నిఖిల్ మహాజన్ (గోదావరి-మరాఠీ)
ఉత్తమ సహాయ నటి: పల్లవి జోషి (ది కాశ్మీర్ ఫైల్స్-హిందీ)
ఉత్తమ సహాయ నటుడు: పంకజ్ త్రిపాఠి (మిమి-హిందీ)
ఉత్తమ యాక్షన్ డైరెక్టర్: కింగ్ సొలొమన్ (ఆర్ఆర్ఆర్)
ఉత్తమ కొరియోగ్రఫీ: ప్రేమ్ రక్షిత్ (ఆర్ఆర్ఆర్-నాటు నాటు)
ఉత్తమ సంగీత దర్శకుడు (పాటలు): పుష్ప (దేవిశ్రీప్రసాద్)
ఉత్తమ సంగీత దర్శకుడు (నేపథ్య సంగీతం): ఎంఎం కీరవాణి
ఉత్తమ గేయ రచయిత: చంద్రబోస్ (కొండపొలం)
ఉత్తమ ఎడిటింగ్: సంజయ్ లీలా బన్సాలీ (గంగూభాయి కతియావాడీ)
ఉత్తమ స్క్రీన్‌ప్లే: నాయట్టు (మలయాళం)
ఉత్తమ సంభాషణలు: గంగూభాయి కతియావాడీ
ఉత్తమ సినిమాటోగ్రఫీ: అవిక్ ముఖోపాధ్యాయ (సర్దార్ ఉద్దమ్)
ఉత్తమ నేపథ్య గాయకుడు: కాలభైరవ (కొమరం భీముడో-ఆర్ఆర్ఆర్)
ఉత్తమ నేపథ్య గాయని: శ్రేయ ఘోశల్ (ఇరివిన్ నిజాల్-మాయావా ఛాయావా)
ఉత్తమ బాల నటుడు: భావిన్ రబారి (ఛెల్లో షో-గుజరాతీ)
ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం: ఆర్ఆర్ఆర్
ఉత్తమ మేకప్: ప్రతిశీల్ సింగ్ డిసౌజా (గంగూబాయి కతియావాడి)
ఉత్తమ కాస్ట్యూమ్స్: వీర్ కపూర్ ఇ (సర్దార్ ఉద్దమ్ సింగ్)
ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: దిమిత్రి మలిచ్, మన్సి ధృవ్ మెహతా (సర్దార్ ఉద్దమ్ సింగ్)

ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్: శ్రీనివాస మోహన్ (ఆర్ఆర్ఆర్)

ఉత్తమ ఆడియోగ్రఫీ (రీ రికార్డింంగ్): సినోయ్ జోసెఫ్(ఝిల్లి డిస్కర్డ్స్-బెంగాలి)
ఉత్తమ ఆడియోగ్రఫీ (సౌండ్ డిజైనింగ్): అనీష‌ బసు (చైవిట్టు-మలయాళం)

ఉత్తమ తెలుగు చిత్రం: ఉప్పెన
ఉత్తమ హిందీ చిత్రం: సర్దార్ ఉదామ్
ఉత్తమ కన్నడ చిత్రం: 777 చార్లీ
ఉత్తమ గుజరాతీ చిత్రం: చెల్లో షో
ఉత్తమ ఒడియా చిత్రం: ప్రతీక్ష (ద వెయిట్)
ఉత్తమ తమిళ చిత్రం: కదాయిసి వివాసాయి
ఉత్తమ బెంగాలీ చిత్రం: కాల్కోఖో-హౌస్ ఆఫ్ టైమ్
ఉత్తమ మలయాళ చిత్రం: హోం
ఉత్తమ మైథిలీ చిత్రం: సమనాంతర్

ఉత్తమ మరాఠీ చిత్రం: ఎక్‌దా కాయ్ జాలా

నర్గిస్‌దత్ జాతీయ సమగ్రతా అవార్డ్: ది కాశ్మీర్ ఫైల్స్
బెస్ట్ డెబ్యూ ఫిలిం డైరెక్టర్ (ఇందిరాగాంధీ అవార్డ్): విష్ణు మోహన్
స్పెషల్ జ్యూరీ అవార్డ్: షేర్షా