ALLU ARJUN: ఐకాన్ స్టార్ పుష్ప రాజ్‌గా రెండో సారి పాన్ ఇండియా బాక్సాఫీస్ బెండు తీయబోతున్నాడు. ఇంటర్వెల్ బ్యాంగ్ షూటింగ్ పూర్తైంది. ప్రీ క్లైమాక్స్‌తోపాటు 25 శాతం టాకీ పార్ట్ షూటింగ్ పెండింగ్ ఉంది. ఆగస్ట్ 15న పుష్ప2 రాబోతోంది. అయితే.. అల్లు అర్జున్.. తర్వాత చేయబోయేది ఏంటి? సెప్టెంబర్‌లో బ్రేక్ తీసుకుని అక్టోబర్ నుంచి త్రివిక్రమ్ సినిమాతో బన్నీ బిజీ అవుతాడా..?
KALKI 2898 AD: శివరాత్రికి కల్కి అవతారం.. మతిపోవాల్సిందే..
బోయపాటికి లైఫ్ ఇస్తాడా? అట్లీతో కమిటైన ప్రాజెక్ట్ పట్టాలెక్కిస్తాడా? ఈ మూడు డౌట్లకు అక్టోబర్‌లోనే ఆన్సర్ దొరకనుంది. నిజానికి బన్నీ పూర్తిగా త్రివిక్రమ్ మూవీకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేలా ఉన్నాడంటున్నారు. కాని ప్యార్‌లల్‌గా బోయపాటి లేదా అట్లీ సినిమా కూడా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. త్రివిక్రమ్ మూవీ చేస్తూనే బోయపాటి సినిమా చేసి వచ్చే ఏడాది దసరా, దీపావళికి వరుసగా రెండు సినిమాలు రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడట బన్నీ. దీనికి కారణం పుష్ప 2 వల్ల రెండేళ్లు గడిచిపోవటమే.
అలాగే, ఇది కూడా హిట్ అవుతుందనే నమ్మకం ఉండటంతో, ఆ తర్వాత భారీగా పెరిగే అంచనాలను తట్టుకోవాలంటే, ఒకటికి రెండు ఆప్షన్స్ ఉండాలనుకోవటం. సో.. బోయపాటి మూవీ కాస్త అటూ ఇటైనా త్రివిక్రమ్ సినిమా తనని సేవ్ చేస్తుంది. అందుకే ఒకేసారి రెండు మూవీలు ప్లాన్ చేస్తున్న బన్నీ, సంక్రాంతికి అట్లీ సినిమాను పట్టాలెక్కిస్తాడని తెలుస్తోంది.