PUSHPA 2: పుష్ప 2 రిలీజ్ డేట్ ఆగస్ట్ 15న ఫిక్స్ చేశారు. గట్టిగా షూటింగ్ స్పీడప్ చేస్తే ఫిబ్రవరి 15 లోగా ప్యాచ్ వర్క్‌తో సహా పూర్తవుతుంది. అంటే మే లేదంటే జూన్‌లో కూడా పుష్ప 2 రావొచ్చు. కాని ఎందుకు పనికట్టుకుని మరీ ఆగస్ట్ 15కి రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారంటే.. గ్రాఫిక్స్ వర్క్, పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్ కోసం టైం బాగా కేటాయించాలనే ఇలా చేస్తున్నారన్నారు. కాని అసలు కారణం వేరే ఉంది. పుష్ప 2 రిలీజ్‌కి ముందే నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో రూ.410 కోట్లు రాబట్టేస్తోంది.
SALAAR: జస్ట్ మిస్.. ‘సలార్‘లో వరద పాత్ర గోపీచంద్ చేసి ఉంటేనా..
ఆల్రెడీ ఆడియో రైట్స్ రూ.60 కోట్లు రాబడితే, అన్ని భాషల శాటిలైట్ రైట్స్ రూ.150 కోట్లకు కొనుగోలు చేసిందట స్టార్ సంస్థ. ఇక డిజిటల్ రైట్స్ ఏకంగా రూ.200 కోట్లు పలికాయి. మొత్తంగా చూస్తే ఈ నాన్ థియేట్రికల్ రైట్సే రూ.410 కోట్లుగా ఉంది. ఇక థియేట్రికల్ రైట్స్ ఏరేంజ్‌లో సేల్ అవుతున్నాయంటే.. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే రూ.190 కోట్లు వచ్చేలా ఉన్నాయట. ఆల్‌మోస్ట్ డీల్ ఓకే అయ్యిందట. 5 డిస్ట్రిబ్యూటర్స్ కలిపి హక్కులు తీసుకున్నారు. అందులో దిల్ రాజు టీం ఒకటి అని తెలుస్తోంది. తమిళ్, కన్నడ, మలయాళం రైట్స్ మొత్తంగా రూ.45 కోట్లని తెలుస్తోంది. కేవలం హిందీ రైట్సే రూ.125 కోట్లని తెలుస్తోంది. అంటే ఓవర్‌సీస్ రైట్స్ కాకుండా టోటల్ ఇండియా వైడ్ థియేట్రికల్ రైట్స్ రూ.310 కోట్లని తెలుస్తోంది.
కాబట్టి, నాన్ థియేట్రికల్ రైట్స్, థియేట్రికల్ రైట్స్ మొత్తంగా చూస్తే రూ.715 కోట్ల లెక్కతేలుతోంది. ఇక హిట్టై రూ.1000 కోట్ల వసూళ్లు వస్తే ఆ లాభాల లెక్కమారే ఛాన్స్ఉంది. ఎలా చూసినా సినిమా బిజినెస్ భారీగా పెంచుకునేందుకే ఆగస్ట్ 15 వరకు టైం తీసుకుంటోందట ఫిల్మ్ టీం. ఇలా అయితే ఒకవైపు గ్రాఫిక్స్‌లాంటి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌కి టైం కుదురుతుంది. అలానే కనీసం మూడు నెలలు ప్రమోషన్ కోసం ఫిల్మ్ టీం దేశవ్యాప్తంగా చక్కర్లు కొట్టేందుకు సమయం దొరకుతుంది. అందుకే అంత దూరంగా విడుదల తేదీని ఫిక్స్ చేసింది సినిమా టీం.