PUSHPA 2 TEASER: బర్త్ డేకి 2 రోజుల ముందే.. ఐకానిక్ గిఫ్ట్..

ఆల్రెడీ దేవి శ్రీ ప్రసాద్ ఈ టీజర్ కోసం రెండు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ట్రాక్‌లు రెడీ చేశాడు. సుకుమార్, బన్నీ ఇద్దరు వచ్చి ఏదో ఒకటి సెలెక్ట్ చేస్తే 80 సెకన్ల డ్యూరేషన్ ఉన్న టీజర్‌ని రిలీజ్ చేస్తారు. నిజానికి ఇది అసలు ప్లాన్.

  • Written By:
  • Updated On - March 30, 2024 / 06:34 PM IST

PUSHPA 2 TEASER: అల్లు అర్జున్న ఐకాన్ స్టార్‌గా మొన్నే దుబాయ్‌లో మైనపు బొమ్మగా మారాడు. తన మైనపు బొమ్మతో కలిసి ఫోటోలకు పోజ్ ఇచ్చి ఫ్యాన్స్‌ని ఖుషీ చేశాడు. ఇప్పుడు తన బర్త్ డే రాబోతోంది. ఏప్రిల్ 8న పుష్ప టీజర్ రావటం పక్కా అయ్యింది. ఆల్రెడీ దేవి శ్రీ ప్రసాద్ ఈ టీజర్ కోసం రెండు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ట్రాక్‌లు రెడీ చేశాడు. సుకుమార్, బన్నీ ఇద్దరు వచ్చి ఏదో ఒకటి సెలెక్ట్ చేస్తే 80 సెకన్ల డ్యూరేషన్ ఉన్న టీజర్‌ని రిలీజ్ చేస్తారు.

Nithiin: నితిన్ సినిమాకు పవన్ టైటిల్.. పాజిటివ్ బజ్ ఖాయమా..?

నిజానికి ఇది అసలు ప్లాన్. కాని ఈ ప్లాన్‌లో చిన్న ఛేంజ్ చెప్పాడు అల్లు అర్జున్. ఏప్రిల్ 8న తన బర్త్ డే అయినప్పటికి 3 రోజుల ముందే ఈ మూవీ టీజర్‌ని లాంచ్ చేయబోతున్నారు. నిజానికి పరశురామ్ డైరెక్షన్‌లో విజయ్ దేవరకొండ చేస్తున్న ఫ్యామిలీ స్టార్ మూవీకి పుష్ప 2 టీజర్‌ని ఎటాచ్ చేయాలనుకున్నారు. కాని డైరెక్టర్ పరశురామ్, ప్రొడ్యూసర్ అల్లు అరవింద్‌ని కాదని దిల్ రాజుతో ఈ మూవీ తీసి అలా గీతా ఆర్ట్స్‌తో గొడవకు దిగాడు కాబట్టి, అల్లు అరవింద్ నుంచి అబ్జెక్షన్ వచ్చింది. పుష్ప 2 ప్రొడక్షన్‌కి అల్లు అరవింద్‌కి సంబంధం లేదు.

నిజానికి పుష్ప ప్రొడ్యూసర్లు సీక్వెల్ టీజర్‌ని ఫ్యామిలీ స్టార్ మూవీ విడుదలయ్యే ఏప్రిల్ 5కి రిలీజ్ చేయాలనుకున్నారు. కాని అల్లు అరవింద్ సీన్‌లోకొచ్చి పుష్ప 2 టీజర్‌ని మలయాళం మూవీ మంజుమ్మల్ బోయ్స్ డబ్ వర్షన్‌కు ఎటాచ్ చేయిస్తున్నాడట. అలా వచ్చే శనివారం పుష్ప 2 టీజర్ విడుదలయ్యే అవకాశం ఉందట.