PUSHPA 2: పాన్ వరల్డ్ వద్దు.. పాన్ ఆసియా చాలంటున్న పుష్ప రాజ్

పాన్ ఇండియా హిట్ వస్తే వెంటనే ఈమధ్య పాన్ వరల్డ్ మార్కెట్ మీద ఫోకస్ చేయటం కామనైంది. కాని బన్నీ మాత్రం పాన్ వరల్డ్ వద్దు పాన్ ఆసియానే ముద్దంటున్నాడు. నిజమే.. తన పుష్ప 2 మూవీ ఇక మీదట పాన్ ఇండియా ప్రాజెక్ట్ కాదట.

  • Written By:
  • Publish Date - February 16, 2024 / 05:50 PM IST

PUSHPA 2: పుష్ప రాజ్ ఏ విషయంలో తగ్గేది లేదంటాడు. అలానే తను తగ్గలేదు కాబట్టే పాన్ ఇండియా లెవల్లో నెగ్గాడు. కాని ఎందుకో పుష్ప 2 విషయంలో తగ్గుతున్నాడు. పాన్ ఇండియా హిట్ వస్తే వెంటనే ఈమధ్య పాన్ వరల్డ్ మార్కెట్ మీద ఫోకస్ చేయటం కామనైంది. కాని బన్నీ మాత్రం పాన్ వరల్డ్ వద్దు పాన్ ఆసియానే ముద్దంటున్నాడు. నిజమే.. తన పుష్ప 2 మూవీ ఇక మీదట పాన్ ఇండియా ప్రాజెక్ట్ కాదట.

DEVARA: దసరాకు దేవర దండయాత్ర.. ఇక పూనకాలే

అలాగని పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ కాదు. మధ్యస్తంగా పాన్ ఆసియా ప్రాజెక్ట్‌గా రాబోతోంది. సినిమా అంతా ఇండియా, మయన్మార్, సింగపూర్, థాయ్ లాండ్, జపాన్‌లోనే షూట్ చేస్తున్నారు. కంటెంట్ కూడా ఇండోనేషియా, మలేషియా, జపాన్, కంబోడియా చుట్టూ తిరుగుతుందట. దీన్ని బట్టి చూస్తే బన్నీ తన నెక్ట్ టార్గెట్ సౌత్ ఏసియాగా ఫిక్స్ చేసుకున్నట్టున్నాడు. ఇండియాలో కూడా తను ముందు తెలుగు మార్కెట్.. తర్వాత మళయాల మార్కెట్‌ని టార్గెట్ చేసుకున్నాడు. తర్వాత హిందీ మార్కెట్‌ని పుష్పగా ఏలాడు.

అలాగే నెమ్మదిగా ఒక్కో మెట్టు ఎక్కాలనుకుంటున్నాడట. అందుకే పుష్ప 2లో జపాన్, ఇండోనేషియా, మలేషియాకు సంబంధించిన సీన్లుంటాయని, సౌత్ ఏషియా మార్కెట్‌ని రీచ్ అయ్యేలా పుష్ప 2ని డిజైన్ చేశారని తెలుస్తోంది. ఈ చిత్రం వచ్చే ఆగష్టు 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్ర షూటింగ్ కీలక దశకు చేరుకుంది.