Pawan Kalyan allu arjun : మెగాసంబరాల్లో కనిపించని అల్లు ఫ్యామిలీ

మెగా ఫ్యామిలీ (Mega Family) లో ఏ చిన్న వేడుక జరిగినా అల్లు అరవింద్ (Allu Arvind) ముందుండి నడిపిస్తారు అనే టాక్ ఉంది. మెగా కుటుంబంతో ఆ బంధం, బాధ్యత కూడా అరవింద్‌కు ఉంది.

మెగా ఫ్యామిలీ (Mega Family) లో ఏ చిన్న వేడుక జరిగినా అల్లు అరవింద్ (Allu Arvind) ముందుండి నడిపిస్తారు అనే టాక్ ఉంది. మెగా కుటుంబంతో ఆ బంధం, బాధ్యత కూడా అరవింద్‌కు ఉంది. తాజాగా జనసేనాని (Janasena) పవన్ కల్యాణ్ (Pawan Kalyan) చిరంజీవి ఇంటికి వెళ్లారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గేమ్ ఛేంజర్‌గా మారిన పవన్ ఢిల్లీ ఎన్టీయే మీటింగ్ అనంతరం తన కుటుంబంతో పాటు చిరంజీవి ఇంటికి వెళ్లారు. రామ్ చరణ్ సాధరంగా ఆహ్వానం పలికారు. తరువాత సురేఖను ప్రేమపూర్వకంగా ఆలింగనం చేసుకొని మెగాస్టార్ కాళ్ల మీద పడి ఆశీర్వాదం తీసుకున్నారు.

మెగాస్టార్ పవన్‌కు పూల మాల వేసి సత్కరించారు. తరువాత కేక్ కట్ చేసి వేడుక చేసుకున్నారు. మెగాకుటుంబం అంతా సంబరాలు చేసుకున్నారు. ఈ వేడుకలో మెగా ఫ్యామిలీతో పెనవేసుకుపోయిన అల్లు కుటుంబం నుంచి ఏ ఒక్కరు కనిపించలేదు. దీంతో అసలు కారణం ఏమై ఉంటుందని నెటి జనులు ఆరా తీయడం మొదలు పెట్టారు.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో సైతం అల్లు ఫ్యామిలీ జనసేనకు ఎలాంటి సపోర్ట్ చేసినట్లు కనిపించలేదు. పైగా అల్లు అర్జున్ తన స్నేహితుడు నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్ప రవిరెడ్డి కోసం ప్రచారం చేశారు. అదే రోజు రామ్ చరణ్ పవన్ కల్యాణ్ కోసం పిఠాపురం వేళ్లారు. ఈ విషయంపై నాగబాబు ట్వీట్ దుమారం రేగింది.
పగవాడు, మనవాడు అని మాటలపై అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. ఆ తరువాత జరిగిన పరిణామాలు తెలిసినవే. ఇక ఫలితాల్లో శిల్ప రవిరెడ్డి ఓటమిపాలు అయ్యారు. ఈ విషయం ఏదైనా అల్లు కుటుంబం మనుసులో పెట్టుకున్నారా అనే కోణంలో విశ్లేషకులు ఆలోచిస్తున్నారు.

అయితే పవన్ కల్యాణ్ విజయం తరువాత బన్ని పవన్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. దాన్ని అందరూ పాజిటీవ్‌గానే తీసుకున్నారు. మరీ వేడుకలో ఎవరు కనిపించకపోవడం వెనుక కారణం ఏమై ఉంటుందో. దీనిపై అల్లు అరవింద్ స్పందిస్తారేమో చూడాలి.