కొన్ని సీన్స్ మినహా.. చాలా వరక్ ఫైట్ సీన్స్ కొత్తగా కనిపిస్తున్నాయి. ఛత్రపతికి ఐకానిక్‌గా నిలిచిన సీన్స్ మాత్రం హిందీ రీమేక్‌లో కూడా దింపేశాడు వివి వినాయక్. సినిమాటోగ్రఫీ, బీజీఎం ట్రైలర్‌లో ఇంటెన్సిటీ క్రియేట్ చేశాయి. కథలో కూడా కొన్న మార్పులు ఉన్నట్టు ట్రైలర్‌లో తెలుస్తోంది. హీరోయిన్ నుష్రత్‌ను మాత్రం సింగిల్ ఫ్రేమ్‌లో కూడా రివీల్ చేయలేదు. తెలుగులో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఈ సినిమాతో.. బెల్లంకొండను హిందీలో గ్రాండ్‌గా లాంచ్ చేసేందుకు వినాయక్ ప్లాన్ చేస్తున్నాడు.
టాలీవుడ్‌లో కూడా శ్రీనివాస్‌ను వివి వినాయక్ లాంచ్ చేశాడు. చేసింది తక్కువ సినిమాలే అయినా తెలుగు ఆడియన్స్ నుంచి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు శ్రీనివాస్. మెగాస్టార్ చిరంజీవి తరువాత.. రీమేక్ సినిమాతో హిందీలో అడుగుపెడుతున్న హీరోగా బెల్లంకొండ క్రెడిట్ కొట్టేశాడు. వివి వినాయక్ కూడా ఈ సినిమా ద్వారా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ కాగా మే 12న సినిమాను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు మూవీ యూనిట్. టాలీవుడ్‌లో రికార్డులు తిరగరాసిని ఛత్రపతి.. బాలీవుడ్‌లో ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.