ఎవరో ఒక స్టార్ హిరోయిన్ లేకుండా సినిమా చేయలేని కుర్ర హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌కు తెలుగులో సరైన హిట్ ఒక్కటీ లేదు.. హిందీలో మాత్రం మాంచి క్రేజ్ వుంది. ఇక్కడ డిజాస్టర్ అయిన సీత హిందీ అనువాదం యు ట్యూబ్‌లో 588 మినియన్ వ్యూవ్స్ రాబట్టింది. ఇక జయ జానకి నాయిక అయితే.. 709 మిలియన్ వ్యూవ్స్‌తో యు ట్యూబ్ రికార్డులను క్రియేట్ చేసింది.
బెల్లకొండ శ్రీనివాస్, బోయపాటి కాంబోలో వచ్చిన ‘జయ జానకి నాయక’ తెలుగులో ప్లాప్..కానీ.యూట్యూబ్‌లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ప్రపంచంలో 709మిలియన్ల వ్యూవ్స్ వచ్చిన తొలి సినిమాగా నిలిచింది. కెజిఎఫ్ హిందీ వెర్షన్‌కు 702 మిలియన్ వ్యూవ్స్ వచ్చాయి. కెజిఎఫ్ హిందీ వెర్షన్ థియేటర్స్‌లో రిలీజైన తర్వాత కూడా.. యూట్యూబ్‌లో 702 మిలియన్ వ్యూవ్స్ రావడం విశేషం. బెల్లంకొండ శ్రీనివాస్ హిందీలో నటించకపోయినా.. డబ్బింగులతో అక్కడి ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. దీంతో..ఇప్పుడు టాలీవుడ్ లో చాలామంది పాత సినిమాలు దుమ్ము దులిపి హిందీ డబ్బింగ్ చేస్తున్నారు. అల్లుడు శ్రీను కూడా తెలుగు ఛత్రపతి హిందీ లో చేస్తున్నాడు