Prabhas: డార్లింగ్‌ ఫ్యాన్స్‌ రెడీగా ఉండండి.. సలార్‌ టీజర్‌ వచ్చేస్తోంది..

ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఆదిపురుష్‌ అవుట్‌పుట్‌తో ప్రభాస్‌ ఫ్యాన్స్‌ చాలా డిసప్పాయింట్‌మెంట్‌లో ఉన్నారు. కలెక్షన్స్‌ పరంగా సినిమా సూపర్‌ అనిపించినా.. గ్రౌండ్‌ లెవెల్‌లో ప్రజల మనసు గెలవలేకపోయింది ఆదిపురుష్‌ సినిమా.

  • Written By:
  • Publish Date - June 22, 2023 / 03:43 PM IST

దీంతో డల్‌గా ఫీలవుతున్న ప్రభాస్‌ ఫ్యాన్స్‌ను ఖుషీ చేసేందుకు సలార్‌ నుంచి ఓ అదిరిపోయే అప్‌డేట్‌ ఇవ్వబోతున్నారు మేకర్స్‌. జూలై 7న సలార్‌ సినిమా ట్రైలర్‌ రిలీజ్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా దాదాపు కంప్లీట్‌ ఐంది. మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్‌ ఫుల్‌ మాస్‌ మోడ్‌లో కనిపించబోతున్నాడు. కేజీఎఫ్‌ సినిమాలో యష్‌ను ఎంత వైలెంట్‌గా చూపించాడో ఈ సినిమాలో కూడా ప్రభాస్‌ను అంతే వైలెంట్‌గా చూపించబోతున్నాడు ప్రశాంత్‌ నీల్‌.

బాహుబలి సినిమా తరువాత ప్రభాస్‌కు పెద్ద హిట్‌ లేదు. ఆదిపురుష్‌ కలెక్షన్స్‌ బాగున్నా విమర్శలు, వివాదాలు ఆ సినిమాను చిక్కుల్లో పడేశాయి. దీంతో ఇప్పుడు ఫ్యాన్స్‌ ఆశలు మొత్తం సలార్‌ మీదే పెట్టుకున్నారు. బాహుబలి రేంజ్‌లో ప్రభాస్‌కు కంబ్యాక్‌ ఇచ్చే సినిమా సలారే అని ఫ్యాన్స్‌ కూడా ఫిక్స్‌ అయ్యారు. దీంతో ఈ సినిమా నుంచి వచ్చే ట్రైలర్‌ కోసం ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు.