కారణం బ్రో రిలీజ్ డేట్ వాయిదా పడుతుందంటున్నారు.. నిజంగా అదే కారణమా.. లేదంటే ఏపీలో పొలిటికల్ హీట్ వల్ల బ్రోకి కష్టాలు తప్పవనే గుసగుసలే నిజమయ్యేలా ఉన్నాయా? ఈ డౌట్లే పెరిగాయి. వకీల్ సాబ్ రిలీజ్ టైంలో టిక్కెట్ రేట్లే కాదు, థియేటర్స్ లో సగంకి పైనే సీటింగ్ కి పర్మీషన్ దొరకలేదన్నారు. కరోనా తగ్గే టైంలో కావాలని అలా చేశారన్నారు. కాకపోతే అన్ని సినిమాలకు అదే నియమం పాటించారు కాబట్టి ఇది ఎవరి తప్పు అనలేం.
ఇక భీమ్లానాయక్ టైంలో టిక్కెట్ రేటుని పెంచేఅవకాశం ఇవ్వలేదు. ఇక్కడ కూడా అన్ని సినిమాలకు అదే నియమం పెట్టారు కాబట్టి పొలిటికల్ గా పగపట్టారనే పరిస్తితి లేదు. ఏదేమైనా కరోనా టైంలో ఫుల్ సీటింగ్ ఇచ్చినా, భీమ్లానాయక్ టిక్కెట్ రేటు పెంచుకునే ఛాన్స్ వచ్చినా 200 కోట్ల వసూళ్ల కాస్త 400 కోట్లు దాటేవనేది ఇండస్ట్రీ జనాల అభిప్రాయం. ఏదేమైనా బ్రో రిలీన్ కి 12 రోజుల టైమే ఉంది. కాబట్టి బ్రో ప్రమోషన్ షురూ అవుతుందా? మళ్లీ పొలిటికల్ గా ఇబ్బందులు తప్పవా అన్న డౌట్లు షురూ అయ్యాయి.