Ambajipeta Marriage Band: పెర్ఫామెన్స్‌తో దుమ్ముదులిపిన హీరో సుహాస్

విచిత్రంగా ఇందులో హీరోకి సమానంగా హీరోయిన్ శరణ్య పెర్ఫామెన్స్ ఆకట్టుకుంటోంది. మ్యూజిక్ మ్యాజిక్ చేసింది. కథ, కథనం, దాన్ని నెరేట్ చేసిన దుశ్యంత్ పనితనం మొత్తంగా అంబాజి పేట మ్యారేజ్ బ్యాండ్ అక్కడ కొడితే, సౌండ్ బాక్సాఫీస్ లో వస్తోంది.

  • Written By:
  • Publish Date - February 2, 2024 / 06:13 PM IST

Ambajipeta Marriage Band: అంబాజీ పేట మ్యారేజి బ్యాండ్‌తో బాక్సాఫీసుపై సుహాస్ అండ్ కో దండెత్తారు. దుశ్యంత్ మేకింగ్‌లో తెరకెక్కిన ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా రిలీజైంది. ఇది కూడా మరో కలర్ ఫోటో అనిపించుకునేంత మంచి టాకైతే వచ్చింది. కథలోకి వెలితే, ఒక హీరో, తను విల్ చెల్లిని ప్రేమిస్తాడు. విలన్ మాత్రం హీరో సిస్టర్ మీద లేనిపోని అభాండాలు వేసి పరువు తీస్తాడు. కట్ చేస్తే అప్పటి వరకు లవ్ జర్నీ చేసిన సినిమా కాస్త, ఆత్మాభిమానం దానికోసం హీరో పోరాటం అనేలా మారుతుంది.

KALKI 2898 AD: ఇండియన్ ఆడియెన్స్ ఎదురు చూస్తోంది ఈ సినిమాల కోసమే..

డబ్బుందన్న అహంకారం ఒక వ్యక్తిని విలన్ గా మారిస్తే, వాళ్లని ఎదురించే వ్యక్తి సామాన్యుడే అయినా తనో హీరో అని ప్రూవ్ చేసేలా ఉంది అంబాజీ పేట మ్యారేజీ బ్యాండ్. కథ కొత్తదేం కాదు, కాని దాని నేపథ్యం, ఎంచుకున్న పాత్రలు, వాటిలోపాతుకుపోయిన నటులు సినిమా స్థాయిని పెంచారు. ఎక్కడ పాత్రలు కాదు, అందులో ఎమోషన్సే ఎక్కువ క్యారీ అయ్యాయి. విచిత్రంగా ఇందులో హీరోకి సమానంగా హీరోయిన్ శరణ్య పెర్ఫామెన్స్ ఆకట్టుకుంటోంది. మ్యూజిక్ మ్యాజిక్ చేసింది. కథ, కథనం, దాన్ని నెరేట్ చేసిన దుశ్యంత్ పనితనం మొత్తంగా అంబాజి పేట మ్యారేజ్ బ్యాండ్ అక్కడ కొడితే, సౌండ్ బాక్సాఫీస్ లో వస్తోంది.

లవ్ సీన్లు కాస్త బోరింగ్‌గా ఉన్నా, మిగతా కంటెంట్ కదిలిస్తోంది. ధీర, హ్యాపీ ఎండింగ్, బూట్ కట్ బాలరాజ్ మూవీలతో పోలిస్తే ఈ సినిమాకే కాస్త హిట్ అంటూ మౌత్ టాక్ పెరిగింది. మరి వసూళ్లు అదేరేంజ్‌లో వస్తాయో లేదో మాత్రం మండే కలెక్షన్స్‌తోనే తెలుస్తుంది.