Ram Charan : రామ్ చరణ్‌కు అంబానీ ఎంతిచ్చాడు..

బాలీవుడ్ హీరోలకు ఓ అలవాటు ఉంది. ఏదైనా పెళ్లిలు, ఫంక్షన్స్‌కి వెళితే.. వాళ్లకు గట్టిగా సమర్పించుకోవాల్సిందే. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు రామ్ చరణ్‌కు ముఖేష్ అంబానీ ఎంతిచ్చి ఉంటాడు అనే చర్చ జరుగుతోంది.

బాలీవుడ్ హీరోలకు ఓ అలవాటు ఉంది. ఏదైనా పెళ్లిలు, ఫంక్షన్స్‌కి వెళితే.. వాళ్లకు గట్టిగా సమర్పించుకోవాల్సిందే. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు రామ్ చరణ్‌కు ముఖేష్ అంబానీ ఎంతిచ్చి ఉంటాడు అనే చర్చ జరుగుతోంది.

ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఏ రేంజ్‌లో జరిగాయో సోషల్ మీడియా చెప్పకనే చెప్పేసింది. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట రచ్చ లేపుతున్నాయి. ఏకంగా రామ్ చరణ్, షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్ మధ్య చిచ్చు పెట్టేసింది. ఇదిలా ఉంటే.. ఖాన్ త్రయం ఏదైనా ఈవెంట్‌కు వెళితే గట్టిగానే వసూళు చేస్తారనే టాక్ ఉంది. ఈ క్రమంలో అంబానీ ఇంట జరిగిన ప్రీ వెడ్డింగ్ వేడుకకు కోట్ల రూపాయలు ఇచ్చి ఉంటారనే టాక్ నడుస్తోంది

హాలీవుడ్ పాప్ సింగర్ రిహాన్నకు 50 కోట్లకు పైగా ఇచ్చారనే న్యూస్ వైరల్ అవుతోంది. మరి రామ చరణ్‌కు కూడా అంబానీ ఏమైనా ఇచ్చి ఉంటాడా? అనే సందేహాలు అక్కడక్కడ వినిపిస్తున్నాయి. టాలీవుడ్ నుంచి కేవలం రామ్ చరణ్‌ దంపతులకు మాత్రమే ఆహ్వానం అందింది. ఈ వేడుకల్లో షారుఖ్, అమీర్, సల్మాన్‌తో కలిసి నాటు నాటు పాటకు స్టెప్పులేశాడు చరణ్. దీని కోసం అంబాని భారీగా సమర్పించుకున్నట్టు టాక్ నడుస్తోంది. అయితే.. అది ఖాన్ త్రయానికే గానీ, రామ్ చరణ్‌ విషయంలో మాత్రం అలాంటిదేమి లేదని అంటున్నారు. చరణ్ ఈ వేడుకల్లో ఇష్ట పూర్వకంగానే పాల్గొన్నాడని టాక్