KALKI 2898 AD: అశ్వత్థామ ఇంట్రడక్షన్ అంటూ ప్రభాస్ కల్కి మూవీ టీమ్ రిలీజ్ చేసిన వీడియో గ్లింప్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో అమితాబ్ లుక్‌పై.. కొత్త డిస్కషన్ మొదలైంది. నల్లటి జుట్టు, కోర మీసాలు.. అమితాబ్ యంగ్ లుక్ ఇప్పుడు.. నెటిజన్లకు పెద్ద పనే పెట్టింది. కెరీర్ స్టార్టింగ్‌లో అమితాబ్‌కు యాంగ్రీ యంగ్ మ్యాన్ అనే ఇమేజ్ ఉండేది. అప్పట్లో ఆయన ఎలా ఉండేవారో.. అలానే ఇప్పుడు కల్కి లుక్‌లో చూపించారని మెజారిటీ ఫ్యాన్స్ అంటున్నారు.
Aishwarya Rai Bachchan : జస్ట్ సెల్ఫీ తో నోళ్లు మూయించిన ఐశ్వర్య రాయ్..
ఇదంతా డీ ఏజింగ్ టెక్నాలజీ మహిమ. ఆ టెక్నాలజీ ద్వారా అమితాబ్ యంగ్ లుక్ క్రియేట్ చేశారు. ఆ లుక్ చూసి ఆశ్చర్యపోతున్న ఆడియెన్స్ కొందరయితే.. పెదవి విరుస్తున్న వారు మరికొందరు. కొరటాల చేసిన తప్పే.. కల్కి డైరెక్టర్ నాగ్‌అశ్విన్ కూడా చేస్తున్నారని ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు. ఆచార్యలో చిరు డీఏజింగ్ లుక్‌తో.. ట్రోల్స్ బారినపడ్డాడు కొరటాల. అమితాబ్ లుక్ చూసినా.. అలానే కనిపిస్తోందని.. నాగ్‌అశ్విన్‌ను కూడా ట్రోలర్స్ వదిలే అవకాశం లేదు అనే చర్చ జరుగుతోంది. వీళ్ల సంగతి ఎలా ఉన్నా.. గ్లింప్స్ కాబట్టి అలా కొన్ని ఫ్రేమ్స్‌లో మాత్రమే అమితాబ్ యంగ్ లుక్‌లో కనిపించారు. గ్లింప్స్ వరకు యాప్ట్‌గానే ఉంది. మరి ఇదే ఫీల్ సినిమాలో క్యారీ చేయగలరా లేదా అన్నదే అతిపెద్ద విషయం. డీ ఏజింగ్ లుక్ ప్రయోగం చేసి కొరటాల చేతులు కాల్చుకున్నాడు. మిగతా అన్నీ సోసోగా ఉన్నా.. ఆచార్య డిజాస్టర్‌కు.. ఆ లుక్కే కారణం అని కొరటాలను ఓ ఆట ఆడేసుకున్నారు ట్రోలర్స్.
ఇప్పుడు అమితాబ్ లుక్ మీద కూడా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ మధ్య వార్ జరుగుతోంది. కొరటాల చేసిన తప్పే నాగి చేస్తున్నాడని కొందరు.. లేదు లేదు లుక్ అదుర్స్ అంటూ ఇంకొందరు ఎవరికి వారు సోషల్ మీడియా వేదికగా యుద్ధం మొదలుపెట్టారు. దీంతో డీ ఏజింగ్ గురించి సోషల్ మీడియాలో డిస్కషన్ ఫ్యాన్ మధ్య వార్‌కి దారి తీసింది. ఇదంతా ఎలా ఉన్నా.. కల్కి గ్లింప్స్ ఇండస్ట్రీకి కొత్త హోప్ ఇచ్చింది. సీనియర్ హీరోలను యంగ్ లుక్‌లో చూపించే సన్నివేశాలు, కథలు రాసుకోవచ్చనే ధైర్యం ఇచ్చిందన్నది మరికొందరి వాదన.