69th FilmFare Awards : 12th ఫెయిల్‌ కు అవార్డుల మోత

గతేడాది అక్టోబర్‌ 27న థియేటర్లలో విడుదలైన 12th ఫెయిల్‌ (12th Fail)సూపర్‌ హిట్‌గా నిలిచింది. కేవలం మౌత్‌ టాక్‌ తోనే భారీ వసూళ్లు రాబట్టింది. కేవలం 20 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా 70 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టడం విశేషం.

గతేడాది అక్టోబర్‌ 27న థియేటర్లలో విడుదలైన 12th ఫెయిల్‌ (12th Fail)సూపర్‌ హిట్‌గా నిలిచింది. కేవలం మౌత్‌ టాక్‌ తోనే భారీ వసూళ్లు రాబట్టింది. కేవలం 20 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా 70 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టడం విశేషం. విద్యావ్యవస్థ లోని లోటు పాట్లతో పాటు సివిల్స్‌ (Civils) కోసం సన్నద్ధమయ్యే పేద విద్యార్థుల జీవితాలను 12th ఫెయిల్‌ సినిమాలో అత్యద్భుతంగాచూపించారు డైరెక్టర్‌. చిన్న సినిమాగా వచ్చి సాలిడ్ హిట్ కొట్టిన ఈ సినిమాకు అరుదైన గౌరవం దక్కింది.

ప‌ట్టుద‌ల‌తో చ‌ద‌వి చివ‌ర‌కు కాపీ కొట్ట‌కుండానే పాసైన ఆ స్టూడెంట్‌.. ఎలా ఐపీఎస్‌ అయ్యాడ‌న్న స్టోరీని వావ్‌ అనేలా ప్రజెంట్ చేశారు. ప్రేర‌ణాత్మక రీతిలో సాగిన 12th ఫెయిల్ సినిమా ఇప్పుడు ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ (Filmfare Awards) ను దక్కించుకుంది. పైగా ఐదు విభాగాల్లో సత్తా చాటింది. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు, ఉత్తమ స్క్రీన్‌ప్లే, ఉత్తమ ఎడిటింగ్ విభాగాల్లో అవార్డులు లభించాయి. ఈ సినిమా ద‌ర్శకుడు ఉత్తమ ద‌ర్శకుడు అవార్డు అందుకున్నారు. గుజ‌రాత్ లోని గాంధీన‌గ‌ర్ వేదిక‌గా అట్టహాసంగా సాగిన ఈ వేడుక‌లో 2023 లో విడుదలైన చిత్రాల‌కు సంబంధించి విజేత‌ల్ని ప్రక‌టించారు. బాలీవుడ్ (Bollywood) క్యూట్ కపుల్ ర‌ణ‌బీర్ క‌పూర్-అలియాభ‌ట్ ఉత్తమ (Ranbir Kapoor-Aliabhat) న‌టుడు..న‌టి అవార్డులు గెలుచుకున్నారు. సందీప్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ‘యానిమ‌ల్’ చిత్రానికి అవార్డుల పంట పండింది. నటుడు.. గాయకుడు.. సంగీతం .. నేపథ్య సంగీతం.. సౌండ్ డిజైన్ ఇలా మొత్తం ఐదు విభాగాల్లో యానిమ‌ల్ అవార్డులు అందుకుంది.

సినిమా విషయానికి వస్తే… ఈ సినిమాలో చంబల్ ప్రాంతానికి చెందిన ఒక బాలుడు 12వ తరగతిలో ఫెయిల్ అయ్యి తర్వాత డీఎస్పీ అవ్వాలని బయలుదేరి ఢిల్లీకి వచ్చి, UPSC పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఎలా పోలీసు అధికారి అవుతాడు అనే లైన్ తో తెరకెక్కించారు. విధు వినోద్ చోప్రా డైరెక్ట్ చేసిన ఈ సినిమా కూడా ఆయన మున్నాభాయ్ MBBS, 3 ఇడియట్స్ లాగా వారి బ్యానర్‌లో గతంలో నిర్మించిన చిత్రాల మాదిరిగానే ఉండటం విశేషం. ప్రేర‌ణాత్మక రీతిలో సాగిన 12th ఫెయిల్ సినిమా ఇప్పుడు ఆస్కార్స్‌కు ఇండిపెండెంట్ నామినేష‌న్ కింద వెళ్లింది. మొత్తానికి సినిమా సూపర్‌ హిట్‌ టాక్‌ తెచ్చుకోవడంతో పాటు అవార్డుల మోత మోగిస్తోంది.