అనంత్ అంబానీ, రాధిక పెళ్లి గ్రాండ్‌గా జరిగింది. మూడు రోజుల పాటు ఈ వేడుక జరగనుంది. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, శాండల్‌వుడ్ అనే లెక్క లేకుండా.. స్టార్స్ అంతా ఇప్పుడు పెళ్లిలోనే కనిపిస్తున్నారు. ఆ పార్టీ, ఈ పార్టీ అని కాదు.. పొలిటీషియన్స అంతా.. ఇప్పుడు కేరాఫ్ అంబానీ మ్యారేజీ అని చెప్తున్నారు. వాల్డ్‌వైడ్‌గా రాజకీయ, సినీ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు ఇక్కడికి వచ్చేశారు. ప్రియాంక చోప్రా కూడా తన భర్త నిక్‌తో కలిసి.. అనంత్, రాధిక పెళ్లి కోసం విదేశాల నుంచి ఇండియాకు వచ్చింది. పీసీ ఇలా దిగిందో లేదో.. అలా నెగిటివ్ కామెంట్స్ స్టార్ట్ అయ్యాయ్. ప్రియాంకకు పరిణీతి చోప్రా చెల్లెలు. ఆమె పెళ్లికి దూరంగా ఉన్న పీసీ.. ఎలాంటి సంబంధం లేని.. అంబానీ మ్యారేజీకి మాత్రం వచ్చేసింది.
ఇదే ఇప్పుడు నెటిజన్లకు కోపం తెప్పిస్తోంది. పరిణీతి పెళ్లిని అడ్డుపెట్టుకొని ప్రియాంకను ఏకి పారేస్తున్నారు. గతేడాది సెప్టెంబర్‌లో ప్రియాంక కజిన్ పరిణీతి చోప్రా పెళ్లి.. రాఘవ్ చద్దాతో జరిగింది. ఐతే తన సోదరి ప్రియాంక చోప్రా పెళ్లిలో ఎక్కడా కనిపించలేదు. అప్పట్లో అది చాలా చర్చకు దారి తీసింది. వరుసకు అక్కచెల్లెళ్లయిన పరిణితి, ప్రియాంక మధ్య గొడవ జరిగిందా అనే గుసగుసలు వినిపించాయ్. ఐతే పెళ్లి జరిగాక సోషల్ మీడియా వేదికగా.. పరిణితికి ప్రియాంక విషెస్ చెప్పింది. దీంతో ఆమె వేరే ఏదో కారణంతో పరిణితి పెళ్లికి హాజరుకాలేదేమో అని సరిపెట్టుకున్నారు.
దీంతో ఆ వివాదం సద్దుమణిగింది. ఐతే ఇప్పుడు అంబానీ పెళ్లిలో భర్తతో కలిసి ప్రియాంక ప్రత్యక్షం అవ్వడాన్ని మూవీ లవర్స్ డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. చెల్లి పెళ్లికి టైం లేదు కానీ.. అంబానీ పెళ్లికి మాత్రం టైమ్ నడుచుకుంటూ వచ్చిందా అంటూ ఆడేసుకుంటున్నారు. ఇక అనంత్, రాధిక పెళ్లిలో ప్రియాంక పసుపు రంగు లెహంగా ధరించి అందంగా కనిపించింది. పింక్ సూట్, పైజామా ధరించి నిక్ జోనాస్ హ్యాండ్సమ్‌గా తయారయ్యారు. పెళ్లి వేడుకలో ప్రియాంక సంతోషంగా డాన్స్ చేస్తూ కనిపించింది. ఆమె డాన్స్ కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయ్.