ANCHOR SUMA: ఇదేం పని సుమా.. యాంకర్‌ సుమను ఆడుకుంటున్న నెటిజన్లు

హైపర్‌ ఆది ఫ్యాన్స్‌ అంతా సుమను ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారు. సినిమా ప్రమోషన్స్‌ కోసం పక్కవాళ్లను ఇన్సల్ట్‌ చేస్తారా అంటూ లెఫ్ట్‌ రైట్‌ ఇచ్చేస్తున్నారు. కొడుకు సినిమా కోసం ఇంత ఓవరాక్షన్‌ చయాల్సిన పని లేదంటూ చీవాట్లు పెడుతున్నారు.

  • Written By:
  • Publish Date - January 2, 2024 / 06:30 PM IST

ANCHOR SUMA: ప్రతీ సినిమాకు ప్రమోషన్‌ అనేది చాలా ముఖ్యం. సినిమా ఎలా ఉన్నా.. అది పబ్లిక్‌కి రీచ్‌ అవ్వాలంటే ఖచ్చితంగా ప్రమోషన్స్ నిర్వహించాల్సిందే. ఒకప్పటితో కంపేర్‌ చేస్తే ప్రస్తుతం ప్రమోషన్స్‌ స్టైల్‌ మారిపోయింది. సినిమాను హైలెట్‌ చేసేందుకు నానా అల్లరి చేసి వైరల్‌ అవుతున్నారు. ఇంటర్నెట్‌లో వచ్చే ఆ హైప్‌ని సినిమాకు వాడేస్తున్నారు. ఇలాంటిది ఎవరో చిన్న చిన్న యాక్టర్స్‌ చేస్తే ఓకే. కానీ ఇండస్ట్రీలో ఫేమస్‌ అయిన వాళ్లు కూడా ఇదే పద్ధతి కంటిన్యూ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది.

Sandeep Reddy Vanga: మాస్టర్ పీస్.. చిరుతో సందీప్ వంగా నిజమేనా

టాలీవుడ్‌లో ఫేమస్‌ యాంకర్‌ సుమ కొడుకు రోషన్‌ రీసెంట్‌గా బబుల్‌గమ్‌ అనే సినిమా తీశాడు. ఆ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మూవీ టీం ఓ డాన్స్‌ షోకు వచ్చారు. ఆ షోకు సుమ కూడా వచ్చింది. డాన్స్ స్టెప్పులో భాగంగా శ్వేత నాయుడు అనే ఓ డాన్సర్‌ నోటిలో నీళ్లు బయటికి ఊస్తూ ఓ స్టెప్‌ చేసింది. ఆమె పెర్ఫార్మెన్స్‌ పూర్తైన తరువాత అదే స్టెప్‌ చేయాలంటూ హైపర్‌ ఆది సుమను అడిగాడు. వెంటనే సుమ కూడా తన నోట్లో నీళ్లు పోసుకుని రెడీగా ఉంది. సుమ ఊసే నీళ్లు పట్టుకునేందుకు ఆది బకెట్‌తో రెడీగా ఉన్నాడు. కానీ సుమ మాత్రం నీళ్లు బకెట్‌లో ఊయకుండా ఆది మొహం మీద ఊసింది. ఇది కామెడీ కోసం చేశారా.. లేక అనుకోకుండా జరిగిందా.. తెలియదు. కానీ.. ఈ ఇష్యూ మాత్రం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది.

హైపర్‌ ఆది ఫ్యాన్స్‌ అంతా సుమను ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారు. సినిమా ప్రమోషన్స్‌ కోసం పక్కవాళ్లను ఇన్సల్ట్‌ చేస్తారా అంటూ లెఫ్ట్‌ రైట్‌ ఇచ్చేస్తున్నారు. కొడుకు సినిమా కోసం ఇంత ఓవరాక్షన్‌ చయాల్సిన పని లేదంటూ చీవాట్లు పెడుతున్నారు. సరదా కోసం చేస్తే పద్ధతిగా చేయాలి కానీ ఇదేంటి అంటున్నారు ఈ వీడియో చూసినవాళ్లు. మరి దీనిపై మూవీ యూనిట్‌ ఎలా రియాక్ట్‌ అవుతుందో చూడాలి.