Anchor Suma’s son : పోలీసుల అదుపులో యాంకర్‌ సుమ కొడుకు.. భారీగా సూట్‌కేసులు స్వాధీనం..

తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో పరిచయం అవసరం లేని పేరు యాంకర్‌ సుమ. ఈవెంట్‌ ఏదైనా సుమ ఉంటే వచ్చే మజా వేరు. తన యాంకరింగ్‌తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న సుమ.. రీసెంట్‌గానే తన కొడుకును సినిమాల్లోకి తీసుకువచ్చింది. ఈ మధ్యే ఓ సినిమా కూడా చేశాడు సుమ కొడుకు రోషన్‌.

తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో పరిచయం అవసరం లేని పేరు యాంకర్‌ సుమ. ఈవెంట్‌ ఏదైనా సుమ ఉంటే వచ్చే మజా వేరు. తన యాంకరింగ్‌తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న సుమ.. రీసెంట్‌గానే తన కొడుకును సినిమాల్లోకి తీసుకువచ్చింది. ఈ మధ్యే ఓ సినిమా కూడా చేశాడు సుమ కొడుకు రోషన్‌. అయితే ఇప్పుడు అదే రోషన్‌ పోలీసుల అదుపులో ఉన్నాడు. తెలంగాణలో ఎన్నికల కారణంగా పోలీసులు ఎక్కడికక్కడ చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేశారు. ప్రతీ వాహనాన్ని చెక్‌ చేస్తున్నారు. అలాగే రోషన్‌ కారును కూడా చెక్‌ చేశారు. మూడు సూట్‌కేస్‌లను స్వాధీనం చేసుకున్నారు. కానీ ఆ సూట్‌ కేసుల్లో ఉంది డబ్బు కాదు. జిలేబీలు, బబూల్‌ గమ్స్‌. అవును.. సుమ కొడుకును ఆపింది నిజం పోలీసులు కాదు. రోషన్‌ నిజంగా పోలీసుల అదుపులో లేడు. ఇదంతా ఓ ప్రాంక్‌ వీడియో. రోషన్‌ హీరోగా వస్తున్న బబూల్‌గమ్‌ సినిమా ప్రమోషనస్‌లో భాగంగా ఈ వీడియో చేశాడు రోషన్‌. ప్రస్తుతం తెలంగాణలో ఎలక్షన్స్‌ ఉండటంతో అదే ట్రెండ్‌ను వాడుకుని సినిమా ప్రమోషన్స్‌ చేశాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. చాలా మంది నిజంగానే రోషన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అనుకున్నారు. దీంతో సుమ కుటుంబ సభ్యులు ఈ విషయంలో క్లారిటీ ఇచ్చారు. కేవలం సినిమా ప్రమోషన్స్‌లో భాగంగానే ఈ వీడియో చేశారని.. ప్రస్తుతం రోషన్‌ ఇంట్లోనే ఉన్నాడని చెప్పారు. ఇక సోషల్‌ మీడియాలో ఈ వీడియో చూసి రోషన్‌ను కొందరు సపోర్ట్‌ చేస్తుంటే కొందరు మాత్రం తిడుతున్నారు. సినిమా ప్రమోషన్స్‌ చేయడానికి ఇంతకంటే బెటర్‌ ఆప్షన్‌ దొరకలేదా అంటూ మూవీ టీంకు చీవాట్లు పెడుతుఉన్నారు.