ANIMAL: యానిమల్, టాక్సిక్.. టైటిల్స్ ట్రెండ్ మారిందా?

ఇప్పుడు మరో మూవీ ట్రెండ్ సెట్ చేసేలా ఉంది. అదే కేజీయఫ్ ఫేం కన్నడ రాక్ స్టార్ చేస్తున్న కొత్త సినిమా టాక్సిక్. దానర్ధం విషపూరితం. ఇప్పుడు ఈ సినిమాల పేర్లు కొత్త ట్రెండ్ సెట్ చేసేలా ఉన్నాయి. మొన్నటి వరకు ఇడియట్, రాస్కెల్, ఫూల్, లోఫర్ ఇలాంటి పేర్లు, అలాంటి పాత్రలే హీరోయిజాన్ని ఎలివేట్ చేశాయి.

  • Written By:
  • Publish Date - December 8, 2023 / 07:19 PM IST

ANIMAL: టాలీవుడ్‌లో లోఫర్, ఇడియట్, పోకిరి.. ఇవన్నీ ఇప్పుడు హిట్లు. ట్రెండ్ సెట్ చేసిన, చేస్తున్న మూవీల టైటిల్స్. అచ్చంగా ఇలానే సందీప్ రెడ్డి వంగ తన మూవీకి యానిమల్ పేరు పెట్టాడు. వెయ్యి కోట్ల వసూళ్ల వైపు దూసుకెళుతున్న ఈ మూవీతో ట్రెండ్ సెట్ చేస్తున్నాడు. ఇప్పుడు మరో మూవీ ట్రెండ్ సెట్ చేసేలా ఉంది. అదే కేజీయఫ్ ఫేం కన్నడ రాక్ స్టార్ చేస్తున్న కొత్త సినిమా టాక్సిక్. దానర్ధం విషపూరితం. ఇప్పుడు ఈ సినిమాల పేర్లు కొత్త ట్రెండ్ సెట్ చేసేలా ఉన్నాయి.

SRI REDDY: శ్రీలంకలో దగ్గుబాటి అభిరామ్‌ పెళ్లి.. సీతను నేనే అంటూ శ్రీరెడ్డి పోస్ట్‌..

మొన్నటి వరకు ఇడియట్, రాస్కెల్, ఫూల్, లోఫర్ ఇలాంటి పేర్లు, అలాంటి పాత్రలే హీరోయిజాన్ని ఎలివేట్ చేశాయి. ఇప్పుడు బూతులకు కాలంచెల్లింది. అంతకుమించే పాత్రలు, వాటిని ప్రతిబింబించే మూవీలు వస్తున్నాయి. యానిమల్ మూవీలో హీరో చాలా కిరాతకంగా విలన్లని చంపేస్తాడు. అంతకంటే కిరాతకంగా తనకు నచ్చిన పనులు చేస్తాడు. నిజం చెప్పాలంటే సినిమా టైటిల్ ఎంత అగ్లీగా ఉంటే అంత హీరోయిజం ఎలివేట్ అవుతుందనే స్టేజ్‌కు చేరాయి సినిమాలు. అందుకే యానిమల్, టాక్సిక్ లాంటి డైరెక్ట్ మీనింగ్ ఇచ్చే పదాలు వాడే హీరోయిజాన్ని చూపిస్తున్నారు.

యానిమల్ అంటేనే ఆ మూవీ అలా ఉంటే.. మరి టాక్సిక్ ఎలా ఉంటుంది..? టాక్సిక్ అంటేనే విషం.. మరి దేశాన్ని ప్రాంతాన్ని విషపూరితం చేసే వ్యక్తిగా రాఖీ భాయ్ కనిపిస్తాడా? ఏదేమైనా టైటిల్ నుంచి క్యారెక్టరైజేషన్ వరకు ట్రెండ్ మారింది. మారుతూనే ఉంది.