Animal: కలెక్షన్ల సునామీ.. రూ.500 కోట్ల యానిమల్..!

భారీ అంచనాలతో డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మొదటి రోజు రూ.116 కోట్ల గ్రాస్‌‌తో సత్తా చాటింది. రెండో రోజు రూ.120 కోట్ల గ్రాస్, మూడో రోజు రూ.120 కోట్ల గ్రాస్‌తో మరింత జోరు చూపించిన యానిమల్.. ఫస్ట్ వీకెండ్‌లోనే రూ.356 కోట్ల గ్రాస్‌తో సంచలనం సృష్టించింది.

  • Written By:
  • Publish Date - December 6, 2023 / 04:47 PM IST

Animal: యానిమల్ మూవీ బాక్సాఫీస్ దగ్గర తన దూకుడు కొనసాగిస్తోంది. నాలుగు రోజుల్లోనే రూ.500 కోట్ల గ్రాస్ క్లబ్‌లో చేరింది. భారీ అంచనాలతో డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మొదటి రోజు రూ.116 కోట్ల గ్రాస్‌‌తో సత్తా చాటింది. రెండో రోజు రూ.120 కోట్ల గ్రాస్, మూడో రోజు రూ.120 కోట్ల గ్రాస్‌తో మరింత జోరు చూపించిన యానిమల్.. ఫస్ట్ వీకెండ్‌లోనే రూ.356 కోట్ల గ్రాస్‌తో సంచలనం సృష్టించింది. ఇక నాలుగో రోజు సోమవారం అయినప్పటికీ రూ.69 కోట్ల గ్రాస్‌తో సర్ ప్రైజ్ చేసింది.

Ram Gopal Varma: తెలంగాణలో జనసేన ఓటమి.. పవన్‌పై మరోసారి వర్మ సెటైర్లు..

దీంతో నాలుగు రోజుల్లోనే ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా రూ.425 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇదే జోరు కొనసాగించి ఈ సినిమా రూ.500 కోట్ల గ్రాస్ క్లబ్‌లో చేరిపోయింది. అత్యధికంగా రూ.400 కోట్ల గ్రాస్ సినిమాలు కలిగిన ఇండియన్ హీరోలలో చెరో నాలుగు సినిమాలతో ఆమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్ టాప్‌లో ఉండగా.. చెరో మూడు సినిమాలతో ప్రభాస్, షారుఖ్ ఖాన్ రెండో స్థానంలో ఉన్నారు. ఇప్పుడు ప్రభాస్, షారుఖ్ సరసన రణబీర్ కపూర్ చేరాడు. గతంలో ‘సంజు’, ‘బ్రహ్మాస్త్ర’ సినిమాలతో రూ.400 కోట్ల గ్రాస్ క్లబ్‌లో చేరిన.. ఇప్పుడు ‘యానిమల్’తో మూడోసారి ఈ ఫీట్ సాధించాడు. దాదాపు రూ.210 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రిలీజ్ అయిన యానిమల్ మూవీ.. ఇప్పటికే అన్ని సెంటర్స్‌లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రీచ్ అయింది. ప్రస్తుతం వస్తున్న కలెక్షన్స్ అంతా లాభాలే. ఇప్పటికీ థియేటర్లో 48.92 ఆక్యుపెన్సీని మెయింటెన్ చేస్తుంది యానిమల్.

కాబట్టి ఫస్ట్ వీక్ కంప్లీట్ అయ్యేసరికి భారీ వసూళ్లు రాబట్టడం గ్యారెంటీ. మొత్తంగా రణ్‌బీర్ కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా యానిమల్ నిలిచేలా ఉంది. తెలుగులో ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు రిలీజ్ చేశారు. ఇప్పటికే దిల్ రాజుకు భారీగా లాభాలను తెచ్చిపెట్టింది యానిమల్. మరి లాంగ్ రన్‌లో యానిమల్ ఎంత వసూళ్లను రాబడుతుందో చూడాలి.