రణబీర్ కపూర్ (Ranbir Kapoor) సందీప్ రెడ్డి (Sandeep Reddy) వంగా కాంబినేషన్లో వచ్చిన యానిమల్ మూవీ బాక్సాఫీస్‌ను ఏ రేంజ్‌లో బ్లాస్ట్ చేసిందో తెలిసిందే.. యానిమల్ (Animal) సినిమా రోజుకు ఒక రికార్డును బ్లాస్ట్ చేస్తూ రికార్డు వసూళ్లతో సెన్సేషన్ క్రియేట్ చేసింది. రిలీజైన తొలి రోజు నుండి బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో దూసుకు పోతుంది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం అవుతున్న ఈ మూవీ.. ఓటీటీ రికార్డులనూ షేక్ చేస్తోంది. ఈ యాక్షన్ డ్రామాలో హీరోయిజాన్ని కొంత మంది విమర్శిస్తున్నప్పటికీ.. ఎక్కువ మంది మాత్రం ఎంతో ఇష్టపడుతున్నారు. దీంతో.. యానిమల్ మూవీ బాక్సాఫీస్ వద్ద మరో సెన్సేషనల్ రికార్డ్‌కి చేరువలో ఉంది.
ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్ లో కూడా యానిమల్ సినిమా మంచి కలెక్షన్స్ అయితే రాబట్టింది. ఈ ఏడాదిలో ఫస్ట్ వీకెండ్ లో అత్యధిక కలెక్షన్స్ అందుకున్న సినిమాలలో కూడా ఇది రెండవ స్థానంలో నిలిచింది. మొదట ఓవర్సీస్ లో కాస్త తక్కువ థియేటర్లలోనే యానిమల్ సినిమాను విడుదల చేశారు. కానీ రెండవ రోజు నుంచి డిమాండ్ పెరగడంతో స్క్రీన్ల సంఖ్య పెరుగుతూ వచ్చింది. ముఖ్యంగా యూఎస్ లోనే ఈ సినిమాకు సాలిడ్ కలెక్షన్స్ వస్తున్నాయి. యూఎస్‌లో ఇప్పటి వరకు కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన పఠాన్ మరియు జవాన్ చిత్రాలు మాత్రమే అందుకున్న అరుదైన ఫీట్‌ను అందుకోవడానికి యానిమల్ మరికొద్ది దూరంలోనే ఉంది.
USA బాక్సాఫీస్ (USA box office) వద్ద పఠాన్ (Pathan), జవాన్ (Jawan) చిత్రాలు మాత్రమే 15 మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసిన హిందీ సినిమాలు. ఈ అద్భుతమైన ఫీట్‌ని సాధించడానికి యానిమల్ కేవలం కొన్ని డాలర్ల దూరంలో ఉంది. భారతీయ సినిమాని గుర్తించే, బాహుబలి 2, RRR, పఠాన్ , జవాన్ తర్వాత ఈ సంఖ్యను చేరుకున్న ఐదవ చిత్రంగా యానిమల్ నిలిచింది. అసలు ఈ స్థాయిలో సినిమా సక్సెస్ అవుతుంది అని ఎవరు ఊహించలేదు. దర్శకుడు సందీప్ రెడ్డివంగా మాత్రం సినిమా చూసిన తర్వాత ఆడియన్స్ అంచనాలకు మించి సినిమా ఉంటుంది అని చెప్పాడు ఇక ఆడియన్స్ కూడా అదే ఫీలింగ్ తో సినిమా చూసిన తర్వాత బయటికి వస్తున్నారు. కొన్ని నెగటివ్ కామెంట్స్ వచ్చినప్పటికీ కూడా సినిమాపై అవేమీ అంతగా ప్రభావం అయితే చూపలేదు. దీంతో.. ఈ మూవీ బాక్సాఫీస్ రికార్డులు బద్దలుకొడుతోంది.