ANIMAL: యానిమల్ మూడు వారాల్లో రూ.835 కోట్లపైనే రాబట్టింది. ఇప్పుడు రూ.900 కోట్ల క్లబ్‌లోకి ఆల్‌మోస్ట్ అడుగు పెట్టేస్తోంది. ఇక.. వెయ్యికోట్ల క్లబ్‌లో అడుగుపెట్టడం కేవలం ఫార్మాలిటీనే అనుకోవాల్సి వస్తోంది. ఎలా చూసినా రణ్ బీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగ అండ్ కో పండగ చేసుకునే టైం ఇది. ఇలా టీం అంతా సెలబ్రేట్ చేసుకుంటుంటే పిడుగులాంటి వార్త వచ్చేసింది. అదే యానిమల్ మూవీ టీం సెన్సార్ బోర్డ్‌కి లంచం ఇచ్చిందనే కామెంట్ షురూ అయ్యింది.
DEVARA: కొరటాల శివ చేసిన తప్పుతో దేవర మూవీకి కష్టాలు?
ఎందుకంటే యానిమల్‌లో సీన్లకు సెన్సార్ బోర్డ్ ఎందుకు అభ్యంతరం చెప్పలేదనే ప్రశ్నలు ఇప్పుడు మొదలయ్యాయి. ఇందులోకి లోతుగా చూస్తే ఆమధ్య తమిళ హీరో విశాల్ తన మూవీని సెన్సార్ చేసేందుకు, ఆ బోర్డ్‌లో కొందరు లంచం అడిగారన్నాడు. ఆరున్నర లక్షల వరకు లంచం సమర్పించుకున్నామని చెప్పాడు. అంతే తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ గట్టిగానే చర్యలు తీసుకుంది. బయటి మెంబర్స్ చేసిన నిర్వాకం ఇదని అన్నారు కూడా. అంతవరకు ఓకే కానీ, యానిమల్ కంటే తక్కువ వయోలెన్స్‌తోపాటు కొన్ని రొమాంటిక్ సీన్లు ఉన్నమూవీలకే కత్తెర్లు వేసిన సెన్సార్ బోర్డ్.. అసలు యానిమల్‌కి ఎలా పర్మిషన్ ఇచ్చింది అనే సందేహాలు తలెత్తుతున్నాయి.
అది కూడా చాలా సీన్లు తొలగించకుండా అలా ఎలా యానిమల్ మూవీకి ఏ సర్టిఫికేట్‌తో రిలీజ్ అయ్యిందనే చర్చ మొదలైంది. ఐతే ఏ సర్టిఫికేట్ ఇచ్చాక, ఇది అనవసరనమైన చర్చ అనే వాదన కూడా వినిపిస్తోంది. అయితే యానిమల్‌ని డీఫేమ్ చేసేందుకు విశాల్ మూవీ ఇన్స్‌డెంట్‌కి యానిమల్‌ని లింక్ చేస్తున్నారనే వాదన కూడా పెరిగింది.