DEVARA: కొరటాల శివ ఆచార్య పంచ్ నుంచి కోలుకునేందుకు దేవరే సమాధానంలా కనిపించింది. తనని తాను ప్రూవ్ చేసుకునేందుకు మ్యాన్ ఆఫ్ మాసెస్ సాయం తీసుకున్నాడు. దేవర తీస్తున్నాడు. ఆల్‌మోస్ట్ ఈ సినిమా షూటింగ్ పార్ట్ పూర్తైంది. టాకీ పార్ట్‌లో 15 శాతమే పెండింగ్. అంతకంటే ఎక్కువగా సాంగ్స్ పెండింగ్ ఉండటమే ఆందోళన కలిగిస్తోంది. రీసెంట్‌గా సైఫ్ ఆలిఖాన్‌కి గాయమై, తను కోలుకున్నాడు కూడా.
ALLU ARJUN: మరోసారి తెలంగాణ యాస మాట్లాడతానంటున్న బన్నీ..
అయినా షూటింగ్ ఆలస్యం అవటానికి కారణం.. అసలైన విలన్ వల్లేనట. ఆ విలనే మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్. తను టీజర్‌కి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వకపోవటం వల్ల, అది ఆలస్యం అవుతోంది. ఇప్పుడు సాంగ్స్‌ని రెడీ చేయకపోవటం వల్ల షూటింగ్ క్యాన్సిల్ అయ్యింది. అనిరుధ్ ఫోన్లకు అందడు. మెసేజ్‌లు చేస్తే చూడడు. అలాగని తన ట్యాలెంట్‌ని తప్పు పట్టలేం. చేతినిండా అరడజన్ సినిమాల ఆఫర్లు. అన్నీంటికి టైం కేటాయించటం కష్టమే. కాని తప్పదు. కమిట్మెంట్ ఇచ్చాక, సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడ్డాక సాంగ్స్ ఇవ్వాల్సిందే.
రీసెంట్‌గా సైఫ్ ఆలిఖాన్, ఎన్టీఆర్, జాన్వీ కాంబినేషన్‌లో ఓ మాంటాజ్ సాంగ్‌కి సెట్టేసి, షూటింగ్‌కి రెడి అయింది. రాపీ. అనిరుద్ మాత్రం సాంగ్‌ని కంపోజ్ మాత్రమే చేశాడు. ఇంకా రికార్డ్ చేయాలేదు. దీంతో షూటింగ్ ఆగిపోయింది. అలాగే సైఫ్ డేట్లు వేస్ట్ అయ్యాయని తెలుస్తోంది. ఇలా దేవర అక్టోబర్ 10 కైనా వస్తుందా అనే డౌట్లొచ్చేలా చేస్తున్నాడు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్.