Anirudh Ravichander: ఆ వాయింపు వెనక పవర్ స్టార్.. అతడికి సూపర్ స్టార్

సూపర్ స్టార్ రజినీకాంత్ మూవీ అంటే అనిరుధ్‌కి పూనకాలు వచ్చేస్తాయి. అందుకే పేట నుంచి జైలర్ వరకు టైటిల్ పడిందంటే చాలు ఎండ్ కార్డ్ పడేవరకు, పాటలు, బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌తో ఊపేస్తాడు. జైలర్ మూవీకి అలానే అనిరుధ్ మ్యూజిక్ మ్యాజిక్ చేస్తోంది.

  • Written By:
  • Publish Date - August 11, 2023 / 05:57 PM IST

Anirudh Ravichander: పవన్ కళ్యాన్ మూవీ అనగానే తమన్‌కి ఎక్కడలేని పూనకాలొస్తాయి. అందుకే వకీల్ సాబ్, భీమ్లానాయక్ సినిమాలకే కాదు.. బ్రో మూవీలో టైటిల్ కార్డ్ పడినప్పటి నుంచి రెచ్చిపోయి మ్యూజిక్ కొట్టాడు. ఇక ఇలాంటి పూనకాలు సూపర్ స్టార్ రజినీకాంత్ మూవీ అంటే అనిరుధ్‌కి వచ్చేస్తాయి. అందుకే పేట నుంచి జైలర్ వరకు టైటిల్ పడిందంటే చాలు ఎండ్ కార్డ్ పడేవరకు, పాటలు, బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌తో ఊపేస్తాడు. అదే మరో హీరో మూవీకి అనిరుధ్ మ్యూజిక్ చూస్తే యావరేజ్‌గా ఉండొచ్చు. ఉండకపోవచ్చు.

కాని రజినీ సినిమా అంటే మాత్రం పూనకాలు రావాల్సిందే. అదేంటో కొందరు సంగీత దర్శకులు కొందరికే చాలా బాగా మ్యూజిక్ ఇస్తారు. మణిరత్నం మూవీలకే ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ బాగున్నట్టు. రాజమౌళి సినిమాలకే కీరవాణి సంగీతం బాగా కుదిరినట్టు.. కొందరికే లింక్ బాగా సింకవుతుంది. ఇక చిరు, బన్నీ, సుకుమార్ సినిమాలంటే దేవి శ్రీ రెచ్చిపోయిన మరీ మ్యూజిక్ ఇస్తాడు. అలా కొందరి మీద అభిమానం ఎక్కువయ్యో.. లేదంటే అక్కడ ఫ్రీడమ్ వర్కవుట్ అయ్యో మొత్తానికి మ్యూజిక్ మ్యాజిక్ చేస్తుంది. జైలర్ మూవీకి అలానే అనిరుధ్ మ్యూజిక్ మ్యాజిక్ చేస్తోంది. బ్రో మూవీ బాలేకున్నా తమన్ మ్యూజిక్ పిచ్చెక్కించింది. కాని గుంటూరు కారం విషయంలో మాత్రం మహేశ్ సంతృప్తిగా లేడట. తమన్‌కి ఇంత టైమిచ్చినా సరైన సాంగ్స్ ఇవ్వలేకపోయాడట.