Anjali : రామ్ చరణ్ పై అంజలి మనసు

తెలుగు సినిమాల్లో తెలుగమ్మాయిలు కరువైపోతున్న ఈరోజుల్లో.. ఒక తెలుగమ్మాయి అయి ఉండి.. తెలుగుతో పాటు పరభాషల్లోనూ అదరగొడుతోన్న బ్యూటీ అంజలి.

 

 

తెలుగు సినిమాల్లో తెలుగమ్మాయిలు కరువైపోతున్న ఈరోజుల్లో.. ఒక తెలుగమ్మాయి అయి ఉండి.. తెలుగుతో పాటు పరభాషల్లోనూ అదరగొడుతోన్న బ్యూటీ అంజలి. ఈ ఏడాది ఇప్పటికే ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చిన అంజలి.. మే 31న ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమాతో మరోసారి ప్రేక్షకుల్ని పలకరించబోతుంది. విశ్వక్ సేన్ హీరోగా నటించిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ చిత్రంలో అంజలి పాత్ర ఎంతో వైవిధ్యంగా ఉంటుందట.

ఈ సినిమాతో పాటు.. ఈ ఏడాదే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’తోనూ మురిపించబోతుంది అంజలి. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ తర్వాత మళ్లీ స్టార్స్ కాంబోలో అంజలి నటిస్తున్న మూవీ ఇది. ఈ సినిమాలో అంజలి ఓ కీలక పాత్ర మాత్రమే పోషిస్తుందనే ప్రచారం ఈ మధ్య జోరుగా సాగింది. అయితే.. ‘గేమ్ ఛేంజర్’లో తాను క్యారెక్టర్ ఆర్టిస్ట్ కాదని.. తాను కూడా హీరోయినే అని ఇటీవలూ రివీల్ చేసింది.

‘గేమ్ ఛేంజర్’లో పెద్ద చరణ్ కి జోడీగా అంజలి కనిపించబోతుంది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో అంజలి రోల్ ఎంతో ప్రాధాన్యతతో ఉండబోతుందట. అంతేకాదు.. చరణ్, అంజలి మధ్య ఓ పాట కూడా ఉంటుందట. ఇక.. రామ్ చరణ్ గురించి కూడా పలు ఆసక్తికర విశేషాలు తెలిపింది అంజలి. ప్రతీ సన్నివేశంలోనూ చరణ్ బెస్ట్ ఇస్తాడని.. అతని మేకోవర్ నుంచి ప్రతీది ఎంతో యూనిక్ గా డిజైన్ చేసుకుంటాడని చరణ్ పై కాంప్లిమెంట్స్ కురిపించింది. ఇక.. తన క్లోజప్స్ లో ఎలాంటి పెర్ఫామెన్స్ ఇస్తాడో.. సజెషన్ షాట్స్ లోనూ అంతే బెస్ట్ పెర్ఫామెన్స్ ఇవ్వడం చరణ్ కే సాధ్యమైందని మెగాపవర్ స్టార్ ను ఆకాశానికెత్తేసింది అంజలి.