Devara : దేవ‌ర కోసం మ‌రో స్టార్ న‌టి

టాలీవుడ్‌ (Tollywood) లో మోస్ట్ అవైటింగ్ మూవీస్‌లో దేవర ఒకటి.. యంగ్ టైగర్ (Young Tiger) ఎన్టీఆర్‌- స్టార్ డైరెక్టర్ (NTR- Star director) కొరటాల శివ (Koratala Siva) కాంబోలో వస్తున్న ఈ మూవీపై పాన్ ఇండియా (Pan India) లెవెల్‌లో భారీ అంచనాలున్నాయి. ఇక ఈ మూవీ నుంచి వస్తున్న అప్‌డేట్స్.. రీసెంట్‌గా వచ్చిన గ్లింప్స్ సోషల్ మీడియాను షేక్ ఈ మూవీకి విప‌రీత‌మైన హైప్‌ను తీసుకొచ్చాయి. ఈ మూవీతో జూనియర్ రికార్డులను వేటాడేస్తాడంటూ.. ఫ్యాన్స్ అప్పుడే హ‌డావిడి మొదలు పెట్టేశారు.

టాలీవుడ్‌ (Tollywood) లో మోస్ట్ అవైటింగ్ మూవీస్‌లో దేవర ఒకటి.. యంగ్ టైగర్ (Young Tiger) ఎన్టీఆర్‌- స్టార్ డైరెక్టర్ (NTR- Star director) కొరటాల శివ (Koratala Siva) కాంబోలో వస్తున్న ఈ మూవీపై పాన్ ఇండియా (Pan India) లెవెల్‌లో భారీ అంచనాలున్నాయి. ఇక ఈ మూవీ నుంచి వస్తున్న అప్‌డేట్స్.. రీసెంట్‌గా వచ్చిన గ్లింప్స్ సోషల్ మీడియాను షేక్ ఈ మూవీకి విప‌రీత‌మైన హైప్‌ను తీసుకొచ్చాయి. ఈ మూవీతో జూనియర్ రికార్డులను వేటాడేస్తాడంటూ.. ఫ్యాన్స్ అప్పుడే హ‌డావిడి మొదలు పెట్టేశారు. ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన మ‌రొక ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ మూవీలో మ‌రొక స్టార్ న‌టి న‌టించ‌బోతుంద‌న్న న్యూస్ వైర‌ల్‌గా మారింది.

దేవర (Devara) మూవీని రెండు భాగాలుగా తీస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధా ఆర్ట్స్ సంస్థలు కలిసి గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్నాయి. ప్ర‌జెంట్ దేవర పార్ట్ 1 జెడ్ స్పీడ్‌తో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ కి జోడిగా బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీకపూర్ (Janhvi Kapoor) హీరోయిన్గా నటిస్తోంది. అలాగే ఎన్టీఆర్ ను ఢీకొట్టే విలన్ గా బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) నటిస్తున్నాడు. ఎన్టీఆర్ ద్విపాత్రభినయం చేస్తారన్న ప్రచారం కూడా గట్టిగా జరుగుతోంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో ప్రతి నాయ‌క పాత్రను దర్శకుడు కొరటాల శివ చాలా బలంగా డిజైన్ చేశాడని టాక్.. ఇప్పుడు ఈ మూవీకి సంబంధించి మ‌రో క్రేజీ అప్‌డేట్ వినిపిస్తోంది.

లేటెస్ట్ టాలీవుడ్ టాక్ ప్రకారం ఈ మూవీలో మరొక స్టార్ నటి కీలక పాత్ర చేస్తున్నట్లు టాక్. హిందీ, తమిళ, మరాఠీ భాషల్లో నటించి మంచి పేరు అందుకున్న శృతి మరాఠే ఈ మూవీలో నటిస్తున్నారట. అయితే ఇందులో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేస్తుండగా రెండు పాత్రలకు జాన్వీ, శృతి హీరోయిన్స్ గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా దీని పై దేవర మేకర్స్ నుండి అఫీషియల్ ప్రకటన మాత్రం రావాల్సి ఉంది. దేవర మూవీ ఏప్రిల్ 5న ఆడియన్స్ ముందుకి రానుంది. ఆ త‌ర్వాత ఎన్టీఆర్ వార్ 2(NTR War 2) … ఆ తర్వాత ప్రశాంత్ నీల్‌ సినిమాలు పూర్తి చేస్తారు. ఆ వెంటనే దేవర సిక్వెల్ 2 కూడా సెట్స్ మీదకు వెళుతుంది.