Kannappa : భక్త కన్నప్పలో మరో స్టార్‌ హీరో

మంచు విష్ణు (Manchu Vishnu) కలల ప్రాజెక్ట్‌ భక్త కన్నప్పన (Bhakta Kannappa).. ప్యాన్ ఇండియా (Pan India) స్థాయిలో భారీగా వస్తోన్న ఈ చిత్రంపై మంచి అంచనాలున్నాయి. అందుకు తగ్గట్లే విష్ణు కూడా మూవీ మేకింగ్‌లో ఎక్కడా తగ్గట్లేదు.. ఈ ప్రెస్టీజియస్ మూవీలో శివుడి పాత్రలో ప్రభాస్ కనిపిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

మంచు విష్ణు (Manchu Vishnu) కలల ప్రాజెక్ట్‌ భక్త కన్నప్పన (Bhakta Kannappa).. ప్యాన్ ఇండియా (Pan India) స్థాయిలో భారీగా వస్తోన్న ఈ చిత్రంపై మంచి అంచనాలున్నాయి. అందుకు తగ్గట్లే విష్ణు కూడా మూవీ మేకింగ్‌లో ఎక్కడా తగ్గట్లేదు.. ఈ ప్రెస్టీజియస్ మూవీలో శివుడి పాత్రలో ప్రభాస్ కనిపిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. పార్వతిగా నయనతార నటించనున్నట్లు తెలుస్తోంది. వీరితో పాటు ఈ చిత్రంలో చాలామంది స్టార్స్ అతిధి పాత్రల్లో నటిస్తున్నారు అంటూ వస్తున్న వార్తలు విపరీతమైన బజ్‌ను క్రియేట్ చేయగా.. ఇప్పుడు ఈ మూవీలో మరో హీరో భాగమయినట్లు తెలుస్తోంది.

భక్త కన్నప్ప మూవీని చాలా ప్రెస్టీజియస్‌గా తీసుకున్న విష్ణు.. ఈ ప్రాజెక్టులో ఇప్పటికే పలువురు స్టార్‌లను భాగం చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో చిరంజీవి కూడా చిన్న గెస్ట్ అప్పియరెన్స్ ఇస్తున్నట్టు.. బాలయ్య కూడా ఓ పాత్రలో కనిపించనున్నారని టాక్ వినిపిస్తోంది.. మలయాళీ మెగాస్టార్ మోహన్ లాల్ కూడా నటిస్తున్నట్టుగా టీమ్ ఇప్పటికే ప్రకటించింది.. ఈ మూవీలో మరిన్ని సర్‌ప్రైజ్‌లు ఇచ్చేలా ప్లాన్ చేసిన విష్ణు.. మరో కీలక పాత్రకు బాలీవుడ్ హీరో అజయ్ దేవ్‌గణ్‌ను తీసుకున్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. కన్నడ నుంచి శివరాజ్ కుమార్ కూడా అతిధి పాత్రలో నటిస్తున్నట్లు కూడా టాక్ నడుస్తోంది.

మంచు విష్ణుకు గత కొన్నేళ్లుగా సరైన సక్సెస్ లేదు. గతేడాది జిన్నా సినిమాకు ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దీంతో.. భక్తకన్నప్పను ఎలా అయినా భారీ సక్సెస్ చేయాలని మంచువారి అబ్బాయి చాలా కష్టపడుతున్నాడు.. పక్కా ప్లానింగ్‌తో ముందుకు వెళ్తున్నాడు. మహాశివరాత్రి సందర్భంగా ఈ సినిమా నుంచి రీలైజైన మంచు విష్ణు ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. కన్నప్పగా విష్ణు విల్లు పట్టుకొని స్టన్నింగ్‌గా కనిపిస్తున్నాడు. తన ఫిజిక్‌ను కూడా మార్చుకున్నాడు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో అన్ని ప్రధాన భాషాల్లో విడుదలకానుంది. ఇంగ్లీష్‌లో కూడా రిలీజ్ చేస్తున్నట్టుగా మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. మొత్తానికి తన డ్రీమ్ ప్రాజెక్ట్ కోసం గట్టిగా కష్టపడుతున్న విష్ణు ఎలాంటి హిట్‌ కొడతాడో చూడాలి మరి..