Tillu Square, Anupama : టిల్లు స్క్వేర్ తో అనుపమ పరమేశ్వరన్ కి పట్టిన అదృష్టం

గ్యాప్ వచ్చిందో లేక తీసుకుందో గాని టిల్లు స్క్వేర్ (Tillu Square) కి ముందు నాచురల్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ కి పెద్దగా సినిమాలు లేవు.

 

 

 

గ్యాప్ వచ్చిందో లేక తీసుకుందో గాని టిల్లు స్క్వేర్ (Tillu Square) కి ముందు నాచురల్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ కి పెద్దగా సినిమాలు లేవు. సినిమాలు లేవు కాబట్టే తన స్వభావానికి విరుద్ధంగా టిల్లు తో చిందేస్తుందని అన్న వారు కూడా ఉన్నారు. ఏది ఏమైతేనేం టిల్లు తో భారీ విజయాన్ని అందుకుంది. దాంతో ఆమె లిస్ట్ లో పలు సినిమాలు వచ్చి చేరాయి

హనుమాన్ (Hanuman) దర్శకుడు ప్రశాంత్ వర్మ (Prashant Verma) తో ఆక్టోపస్,సినిమా బండి దర్శకుడితో పరదా చేస్తుంది. తమిళం నుంచి పెట్ డిటెక్టివ్ అనే చిత్రాన్ని చేస్తుంది. ప్రణీష్ విజయన్ దీనికి దర్శకుడు.అలాగే మరో క్రేజీ ప్రాజెక్ట్ అనౌన్సుమెంట్ కూడా వచ్చింది. ధృవ్ విక్రమ్ హీరోగా సెల్వరాజ్ దర్శకత్వంలో పా రంజిత్ నిర్మాతగా చేస్తున్న మూవీలోను చేస్తుంది. ఫైనల్ గా లాక్ డౌన్ అనే ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ కి కూడా కమిట్ అయ్యింది. ఏఆర్ జీవా దీనికి దర్శకుడు.

ఇదే కాకుండా భారీ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ లో మూవీ కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇలా మొత్తం ఐదు సినిమాలతో అనుపమ ఫుల్ బిజీగా మారింది. 2015 లో వచ్చిన మలయాళ మూవీ ప్రేమమ్ ఆమె మొదటి సినిమా..తెలుగులో మాత్రం త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) దర్శకత్వం వహించిన అ ఆ ద్వారా క్యారక్టర్ ఆర్టిస్ట్ గా పరిచయం అయ్యింది. ప్రెజంట్ హీరోయిన్ గా పదిహేను సినిమాలకి పైగానే చేసింది.