Anupama Parameswaran: లంగా, ఓణి, పెద్ద బొట్టు, పొడవాటి జడ.. అచ్చమైన తెలుగమ్మాయి అంటే ఇలా ఉండాలి అనిపించేలా ‘అఆ’ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్‌కి ఎంత మంచి పేరు వచ్చిందో అందరికీ తెలిసిందే. వాస్తవానికి అనుపమ మలయాళీ అయినా ముఖంలో తెలుగుదనం ఉట్టిపడుతుంటుంది. దాన్ని గమనించిన త్రివిక్రమ్.. ఆమెకు ఆ సినిమాలో అలాంటి ట్రెడిషనల్ లుక్ ఇచ్చాడు. ఆ తర్వాత కూడా అలాంటి డీసెంట్ క్యారెక్టర్స్‌లోనే కనిపిస్తూ హోమ్‌లీ హీరోయిన్ అనిపించుకుంది.
Mahesh : మహేష్, రాజమౌళి సినిమాలో విలన్ గా స్టార్ హీరో!
కొన్ని సినిమాల్లో మోడ్రన్‌గా కనిపించినా హద్దులు దాటే పెర్‌ఫార్మెన్స్‌కి అవకాశం ఇవ్వలేదు. కేవలం గ్లామర్ హీరోయిన్‌గానే కనిపించింది. తను చేసే సినిమాల్లో కొన్ని లిమిటేషన్స్ పెట్టుకుంది. దాని ప్రకారమే సినిమాలను ఓకే చేసింది. ఇప్పుడా లిమిటేషన్స్‌ను పక్కన పెట్టేసింది అనుపమ. దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన ‘రౌడీ బాయ్స్’ చిత్రంలో మొదటి సారి గ్లామర్‌తోపాటు కొన్ని ఇంటిమేట్ సీన్స్‌లో కూడా నటించి అందరికీ షాక్ ఇచ్చింది అనుపమ. ఆ సినిమా తర్వాత మళ్లీ వెనక్కి వెళ్లి రెగ్యులర్ క్యారెక్టర్స్ చేసింది. మళ్ళీ ఏమనుకుందో ఏమోగానీ.. ‘టిల్లు స్క్వేర్’ చిత్రంలో మరోసారి రెచ్చిపోయింది. ఈ సినిమాలో బ్యూటీ క్యారెక్టర్ ఎలా ఉండబోతోందనే విషయం ట్రైలర్ చూస్తేనే అర్థమవుతోంది. సిద్ధుతో లెక్కకు మించిన డీప్ లిప్‌లాక్ సీన్స్ చేసింది. ట్రైలర్‌లోనే అలా ఉంటే.. ఇక సినిమాలో అనుపమ ఎంత రెచ్చిపోయి ఉంటుందోననే కామెంట్స్ వస్తున్నాయి. మార్చి 29న ‘టిల్లుస్క్వేర్’ రిలీజ్ కాబోతోంది. ‘డిజె టిల్లు’ సూపర్‌హిట్ అవ్వడంతో దానికి సీక్వెల్‌గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. దీంతో సినిమాపై చాలా హై ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే ప్రమోషన్స్ కూడా భారీగానే చేస్తున్నారు.
ఇందులో భాగంగానే సినిమాలోని లిల్లీ క్యారెక్టర్‌ను తను ఎందుకు యాక్సెప్ట్ చేసిందనే విషయాన్ని వెల్లడిరచింది అనుపమ. ‘నెక్స్‌ట్ డోర్ గర్ల్ తరహా పాత్రలు చేసి చేసి బోర్ కొట్టేసింది. నాలోని టాలెంట్ పూర్తిగా చూపించాలంటే గ్లామర్ క్యారెక్టర్స్‌తోనే వీలవుతుంది. లిమిటేషన్స్ పెట్టుకుంటే కెరీర్‌లో ఎలాంటి మార్పు ఉండదు. లిల్లీ వంటి బోల్డ్ క్యారెక్టర్‌ని యాక్సెప్ట్ చెయ్యకపోతే అంతకంటే పెద్ద తప్పు మరొకటి ఉండదు అనిపించింది. అందుకే ఒప్పుకున్నాను. అందరూ నా గ్లామర్‌ని చూసి ఎంజాయ్ చేస్తున్నారంటే అది కూడా గొప్ప విషయమే కదా. నేను ఇంతలా మారిపోవడానికి కారణం సిద్ధు అని అందరూ అంటున్నారు. అదే నిజమైతే అతనికి థాంక్స్ చెప్పాల్సిందే. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఈ సినిమా చేయడం నాకు కొత్త ఎక్స్‌పీరియన్స్ ఇచ్చింది. అది మాత్రం నిజం’ అంటూ ‘టిల్లు స్క్వేర్’ చిత్రంలోని లిల్లీ క్యారెక్టర్ గురించి వివరించింది అనుపమ పరమేశ్వరన్.