Anushka: సినిమా ప్రమోషన్స్‌కు కూడా రాని అనుష్క.. ఇంతకీ కారణమేంటి..?

మహా శివరాత్రినాడు గుడిలో, కృష్ణంరాజు చనిపోయినప్పుడు తప్ప అనుష్క బైటకు రాలేదు. రెండేళ్ల గ్యాప్‌ తర్వాత నటించిన 'మిస్‌ శెట్టి.. మిస్టర్‌ పోలిశెట్టి' సెప్టెంబర్ 7న రిలీజ్‌ అవుతోంది. ఇప్పటివరకు చాలా ఈవెంట్స్‌ జరిగినా.. బొమ్మాళి మాత్రం ఒక్కసారి కూడా మొహం చూపించలేదు.

  • Written By:
  • Publish Date - August 27, 2023 / 04:06 PM IST

Anushka: సమంత మాదిరి అనుష్క కూడా ప్రమోషన్‌కు దూరంగానే వుంటోంది. సామ్‌ ఖుషీ మ్యూజిక్‌ ఈవెంట్‌తో సరిపెడితే.. అనుష్క కూడా ‘మిస్‌ శెట్టి.. మిస్టర్‌ పోలిశెట్టి’ ప్రి రిలీజ్‌ ఈవెంట్‌లో మాత్రమే కనిపించింది. అనుష్క ఎందుకు మొహం చాటేస్తోంది? చేయగా.. చేయగా.. చాలా కాలం తర్వాత ఒక సినిమా చేసింది. అప్పుడెప్పుడో నిశ్శబ్దం మూవీ ఓటీటీలో రాగా.. ఆ తర్వాత ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొంది.

ఆ తర్వాత కనిపించిందే లేదు. మహా శివరాత్రినాడు గుడిలో, కృష్ణంరాజు చనిపోయినప్పుడు తప్ప అనుష్క బైటకు రాలేదు. రెండేళ్ల గ్యాప్‌ తర్వాత నటించిన ‘మిస్‌ శెట్టి.. మిస్టర్‌ పోలిశెట్టి’ సెప్టెంబర్ 7న రిలీజ్‌ అవుతోంది. ఇప్పటివరకు చాలా ఈవెంట్స్‌ జరిగినా.. బొమ్మాళి మాత్రం ఒక్కసారి కూడా మొహం చూపించలేదు. ప్రమోషన్‌ భారాన్నంతా నవీన్‌ తనపై వేసుకుని.. సోలో పెర్‌ఫార్మెన్స్‌ ఇస్తున్నాడు. అనుష్క ‘మిస్‌ శెట్టి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు మాత్రమే వస్తుందని తెలిసింది. ఎందుకు కనిపించడం లేదంటే.. రకరకాలుగా చెప్పుకుంటున్నారు. వెయిట్‌ తగ్గకపోవడం మెయిన్‌ రీజన్‌ అట. అరుదైన వ్యాధితో బాధపడుతోందని.. ఆపకుండా నవ్వడమే ఆ డిసీజ్‌ లక్షణమని చెబుతున్నారు. ఒక్కసారి కూడా రాకపోతే బాగోదని.. ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు వచ్చింది.

మిస్‌ శెట్టి తర్వాత వాట్‌ నెక్ట్స్‌ అంటే.. మరో మూవీ చేతిలో లేదు. హాంబలే ఫిల్మ్స్‌ బొమ్మాళితో లేడీ ఓరియెంటెడ్‌ మూవీ ప్లాన్‌ చేసిందన్న వార్త బైటకొచ్చినా.. ఇంతవరకు ఎనౌన్స్‌ చేయలేదు. ఏడేళ్లయినా.. ఇంకా నార్మల్‌ స్టేజ్‌కి రాకపోవడంతో.. వెయిట్ తగ్గుతుందన్న నమ్మకం కూడా ఫ్యాన్స్‌లో పోయింది. తగ్గకపోతే తగ్గకపోయింది.. కనిపిస్తే చాలన్న ఫీలింగ్‌లో వున్నారు. కానీ.. ఈ అమ్మడు మాత్రం ఆ ఒక్కటీ అడక్కు అంటోంది. రీసెంట్‌గా రిలీజైన ట్రైలర్‌కు లెజెండ్రీ డైరెక్టర్స్‌ రాజమౌళి.. లోకేశ్‌ కనగరాజ్‌ ఫిదా అయిపోయి.. ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్లు చేశారు. భాగమతి తర్వాత హిట్‌ లేని అనుష్క మిస్‌ శెట్టితో ఫామ్‌లోకి వస్తుందేమో చూడాలి మరి.