Anushka – Naveen: పొలిశెట్టితో జత కడుతున్న అనుష్కా శెట్టి

కొంత కాలంగా సినిమాలు తగ్గినా.. స్వీటీకి ఉన్న ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ మాత్రం తగ్గలేదు. దాదాపు రెండున్నరేళ్లుగా అనుష్క మూవీ కోసం ఆమె అభిమానులు ఎదురు చూస్తున్నారు.

  • Written By:
  • Publish Date - March 2, 2023 / 01:40 PM IST

టాలీవుడ్‌లో మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న హీరోయిన్లలో అనుష్క షెట్టి ఒకరు. కొంత కాలంగా సినిమాలు తగ్గినా.. స్వీటీకి ఉన్న ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ మాత్రం తగ్గలేదు. దాదాపు రెండున్నరేళ్లుగా అనుష్క మూవీ కోసం ఆమె అభిమానులు ఎదురు చూస్తున్నారు. వాళ్లందరికీ యూవీ క్రియేషన్స్‌ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. జాతిరత్నాలు ఫేమ్‌ నవీన్‌ పొలిశెట్టి, అనుష్క హీరోహీరోయిన్లుగా యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా టైటిల్‌, ఫస్ట్‌ లుక్‌ను నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్‌ ఇవాళ ఎనౌన్స్‌ చేసింది. మిస్‌ శెట్టి.. మిస్టర్‌ పొలిశెట్టి టైటిల్‌ను ఖరారు చేసినట్టు ట్విటర్‌ ద్వారా తెలిపింది.

ఇది అనుష్కకు 48వ సినిమా కాగా.. నవీన్‌ పొలిశెట్టికి మాత్రం 3వ సినిమా. ఈ రేర్‌ కాంబినేషన్‌ను యూవీ క్రియేషన్స్‌ భలే సెట్‌ చేసిందంటున్నారు మూవీ లవర్స్‌. తనకంటే తక్కువ అనుభవం ఉన్న హీరో అయినా.. నవీన్‌తో చేసేందుకు అనుష్క ఒప్పుకుంది అంటే.. సినిమా కథ డిఫరెంట్‌గా ఉండే అవకాశం ఉందని ఎనాలిసిస్‌ చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి హీరో నవీన్‌ పొలిశెట్టి నిన్నే క్లారిటీ ఇచ్చాడు. అనుష్క ఫొటోతో మాట్లాడుతూ ఓ విడియో రిలీజ్‌ చేశాడు. స్వీటీతో ఎవడీ క్యూటీ అంటూ హింట్‌ కూడా ఇచ్చాడు. నిన్నటి వరకూ టైటిల్‌ను సస్పెన్స్‌లో పెట్టిన మూవీ టీం.. ఇవాళ టైటిల్‌ను రివీల్‌ చేశారు.

అనుష్క సిల్వర్‌ స్క్రీన్‌ మీద కనిపించి దాదాపు రెండు సంవత్సరాలు గడిచింది. ఆమె చివరిగా నటించిన సినిమా నిశ్శబ్దం.. 2020 అక్టోబర్ 2న ప్రైమ్ వీడియోలో రిలీజైంది. మిస్టరీ త్రిల్లర్‌ జానర్‌లో రూపొందిన ఈ సినిమాలో అనుష్క.. మూగ, చెవిటి అమ్మాయి పాత్రలో నటించింది. ఈ సినిమా తరువాత చాలా గ్యాప్ తీసుకున్న స్వీటీ.. ఇప్పుడు మిస్‌ శెట్టి.. మిస్టర్‌ పొలిశెట్టి సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానుంది. రారా కృష్ణయ్య సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న మహేష్‌ బాబు పచ్చిగోళ్ల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌ సినిమాతో సిల్వర్‌ స్క్రీన్‌కు పరిచయమైన నవీన్‌ పొలిశెట్టి.. ఏజెంట్‌ సాయి శ్రీనివాస్‌ ఆత్రేయ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అనుదీప్‌ డైరెక్షన్‌లో వచ్చిన జాతిరత్నాలు సినిమాతో బిగ్గెస్ట్‌ హిట్‌ అందుకున్నాడు. తనకంటే సినిమాళ్లో చాలా అనుభవం ఉన్న అనుష్కతో ఈ హీరో జత కట్టడం ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.