Rajadhani Files: రాజధాని ఫైల్స్ విడుదలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

ఈ చిత్రం నిజానికి గురువారం విడుదల కావాల్సి ఉంది. కొన్ని చోట్ల చిత్ర ప్రదర్శన కూడా ప్రారంభమైంది. అయితే, వైసీపీ నేత కోర్టుకు ఎక్కడంతో చిత్ర ప్రదర్శన నిలిపివేయాలని గురువారం.. కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

  • Written By:
  • Publish Date - February 16, 2024 / 02:06 PM IST

Rajadhani Files: రాజధాని ఫైల్స్ సినిమా విడుదలపై నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. ఈ సినిమా విడుడలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఏపీ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. దీంతో శుక్రవారం నుంచి ఈ సినిమా ప్రదర్శితం కానుంది. ఏపీలోని రాజధాని అంశం ఆధారంగా రూపొందిన చిత్రం రాజధాని ఫైల్స్. ఈ చిత్రం కల్పితం అని చెబుతున్నప్పటికీ, ఏపీ రాజకీయాలకు పూర్తిగా సరిపోతుంది. ఈ చిత్రం విడుదల నిలిపేయాలని కోరుతూ వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ALLU ARJUN-REVANTH REDDY: రేవంత్‌కు అల్లు అర్జున్ మద్దతు.. మామ కోసం ఏం చేయబోతున్నారంటే..

ఈ చిత్రం నిజానికి గురువారం విడుదల కావాల్సి ఉంది. కొన్ని చోట్ల చిత్ర ప్రదర్శన కూడా ప్రారంభమైంది. అయితే, వైసీపీ నేత కోర్టుకు ఎక్కడంతో చిత్ర ప్రదర్శన నిలిపివేయాలని గురువారం.. కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఏపీతోపాటు అనేక చోట్ల రాజధాని ఫైల్స్ చిత్ర ప్రదర్శన నిలిచిపోయింది. రాజధాని ఫైల్స్ విడుదలపై హైకోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం రెవెన్యూ అధికారుల్ని పంపి మరీ చిత్రాన్ని ప్రదర్శించకుండా ఆపించింది. కొన్నిచోట్ల సినిమా నడుస్తుండగా మధ్యలోనే ఆపేశారు. దీనిపై ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చిత్రాన్ని నిలిపివేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై గురువారం హైకోర్టు ధర్మాసనం విచారణ జరిపి, తాత్కాలిక స్టే విధించింది. దీంతో ఈ చిత్రం వాయిదా పడింది. శుక్రవారం మరోసారి దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. చిత్ర ప్రదర్శనకు అనుమతిస్తూ తుది ఉత్తర్వులు ఇచ్చింది. ఈ చిత్ర విడుదలకు అభ్యంతరాలు లేవని హైకోర్టు స్పష్టం చేసింది.

గతంలో సెన్సార్ బోర్డు ఇచ్చిన సర్టిఫికెట్‌తో పాటు రివ్యూ కమిటీ జారీ చేసిన క్లియరెన్స్‌ను కూడా పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఏపీతోపాటు తెలంగాణలోనూ చిత్ర ప్రదర్శన ప్రారంభమైనట్లు తెలుస్తోంది. సింగిల్ స్క్రీన్లతోపాటు మల్టీప్లెక్సుల్లోనూ ఈ చిత్రాన్ని ప్రదర్శిస్తున్నారు. ఏపీలోని అమరావతి రాజధాని అంశం ప్రధానంగా ఈ చిత్రం తెరకెక్కింది. అయితే, చిత్రంలోని నటీనటులు, ప్రాంతం వంటి పేర్లు మాత్రం విభిన్నంగా ఉంటాయి. కానీ, నిజజీవిత పాత్రల్ని గుర్తు చేస్తాయి. ప్రస్తుతం ఈ చిత్రం ఒక వర్గం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది.