చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్, బన్నీ అంతా పాన్ ఇండియా లెవల్లో హిట్ పడ్డాకే పాన్ ఇండియా స్టార్స్ అయ్యారు. కాని విజయ్ మాత్రం పాన్ ఇండియా మూవీలు చేయకుండానే, పాన్ ఇండియా లెవల్లో మార్కెట్‌ని, క్రేజ్‍ని సొంతం చేసుకున్నాడు. కాని పాన్ ఇండియా మూవీ లైగర్ తో ఫ్లాప్ ఫేస్ చేశాడు. ఇదెలా ఉందంటే ఎమ్ సెట్లో స్టేట్ ఫస్ట్ వచ్చి, ఇంటర్ లో ఓ సబ్జెక్ట్ ఫెయిల్ అయినట్టు..
సరే ఏదేమైనా త్రిబుల్ ఆర్ తో చరణ్ , ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్స్ అయ్యారు. ప్రభాస్ ఎప్పుడో అక్కడ జండా పాతాడు. బన్నీ సంగతి తెలిసిందే. ఇక నికిల్ కూడా కార్తికేయ 2 వల్ల వచ్చిన ఇమేజ్ ని కాపాడుకునేందుకు, కార్తికేయ 3 ప్లానింగ్ లో ఉన్నాడు. మరి పవన్ గురించి అంటే తనకి ఆసక్తలేదు. మహేశ్ కి రాజమౌళి మూవీతోపాటు త్రివిక్రమ్ సినిమా ఆన్ ది వే.. ఏజెంట్ తో అకిల్, దసరాతో నాని పాన్ ఇండియా హోప్స్ పెట్టుకుంటే, కాస్త నానినేరీచ్ అయ్యాడనిపిస్తోంది. కాని మొత్తం టాలీవుడ్ లో పాన్ ఇండియా హిట్, పాన్ ఇండియా ఇమేజ్ విషయంలో రౌడీ స్టార్ కి ఈ రెండుబాఖీ పడ్డాయి. తన నెంబర్ ఎప్పుడొస్తుందా అని తను వెయిట్ చేసేలా పరిస్థితులున్నాయి.