దేవర మూవీ వెయ్యికోట్ల క్లబ్ లో చేరబోతోంది. కాకపోతే మండే కలెక్సన్స్ లో కొంత డ్రాప్ కనిపించింది. మళ్లీ మండే సెకండ్ షో, మంగళవారం మార్నింగ్ షోకి వసూళ్లలో పెరుగుదల కనిపిస్తోంది… ఎలా చూసినా రోజుకి 50 నుంచి 70 కోట్లు యావరేజ్ గా కలెక్ట్ చేస్తోంది దేవర. ముందు తెలుగులో, తర్వాత హిందీలో, ప్యార్ లల్ గా ఓవర్ సీస్ లో వసూళ్లు పెరగటంతో, ఇక్కడ వసూళ్ల గలగలలు తగ్గట్లేదు. ఇక తమిళ్, కన్నడ వర్షన్ కి నిదానంగా ఇప్పుడిప్పుడే ఊపు పెరగటంతో, అక్కడ కూడా దేవర దూకుడు పెరుగుతోంది. మొత్తానికి ఈ శుక్రవారమే 1000 కోట్ల క్లబ్ లో దేవర అడుగుపెట్టే అవకాశాలే కనిపిస్తున్నాయి. అయితే నెట్ వసూళ్లు తక్కువగా ఉండటంతో, అప్పుడే వెయ్యికోట్లా అంటూ కొన్ని డౌట్లు కామెంట్ల రూపంలో పేలుతున్నాయి. బేసిగ్గా బాహుబలి నుంచి మొన్నొచ్చిన త్రిబుల్ ఆర్ వరకు ఎవరైనా వసూళ్లంటే గ్రాస్ కలెక్షన్స్ నే లెక్కలోకి తీసుకుంటారు. నెట్ కలెక్షన్స్ ఎప్పవుడైనా ఏ మూవీకైనా తక్కువే ఉంటాయి. అవి నిర్మతకెళ్లే లెక్కలు కాబట్టి, కంగారు పడాల్సిన పనిలేదు. మరో సర్ ప్రైజ్ ఏంటంటే 1000 కోట్ల క్లబ్ లో దేవర అడుగుపెట్టాక, ఇక అందరికీ ఫ్రీ షో అన్నమాటే షాకింగ్ గా మారింది. అదేంటో చూసేయండి.
దేవర 11 రోజుల కలెక్సన్స్ వచ్చాయి… కేవలం తెలంగాణలోనే 47 కోట్ల నెట్ వసూళ్లు, 93 కోట్ల గ్రాస్ వసూళ్ల లెక్కతేలాయి…ఆంధ్రాలో ఈ లెక్క కాస్త ఎక్కేవ ఉంది. జిల్లాల వారిగా కాకుండా ఓవరాల్ గా సీమాంధ్రలో 124 కోట్ల వరకు దేవర వసూళ్లు రాబట్టాడు. అంటే దాదాపు 200 కోట్ల పైనే వసూళ్లు ఇక్కడ వస్తే, నార్త్ ఇండియాలో 270 కోట్ల వరకు వసూళ్ల లెక్కలు తేలాయి.. ఇక యూఎస్, ఆస్ట్రేలియాలో 110 కోట్ల వసూళ్లు తేలితే. యూకే, న్యూజిలాండ్, నార్త్ ఈస్ట్ ఇండియాలో 20 కోట్ల వరకు వసూళ్లొచ్చినట్టు తెలుస్తోంది
ఇక తమిళనాడు, కర్ణాటకా, కేరళాలో వసూళ్లు లెక్కేస్తే 30 కోట్లు వరకు వచ్చినట్టు తెలుస్తోంది.అలా లెక్కేసినా 730 కోట్ల వరకు వసూళ్లొచ్చాయి. కాని దేవర టీం మాత్రం ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన నెట్ వసూళ్లు 466 కోట్లనే ఎనౌన్స్ చేసింది. బేసిగ్గా ఏ మూవీ వసూళ్లనైనా గ్రాస్ కలెక్సన్స్ లో చూస్తారు. అంటే
టిక్కెట్లు ఎన్ని సేల్ అయ్యాయో అవే అసలు వసూల్లు…
అందులో థియేటర్ ఓనర్ కి, డిస్ట్రిబ్యూటర్ కి, పోను మిగిలిన పర్సెంటేట్ నిర్మాతకెళతాయి.. అవే నెట్ వసూల్లు.. అవెప్పుడు తక్కువే ఉంటాయి… 1000 కోట్ల వసూల్లు వస్తే, నిర్మాతకి దక్కేవి 500కోట్ల నుంచి 550 కోట్లే…
ఆలెక్కన 466 కోట్ల వసూళ్ల ని నిర్మాతలు ఎనౌన్స్ చేశారంటేనే, అప్పటికే ఈ సినిమాకు 700 కోట్ల గ్రాస్ వసూల్లొచ్చినట్టు తేలిపోతోంది. ఏదేమైనా ఈ శుక్రవారం వసూళ్లతో కలిపి 1000 కోట్లగ్రాస్ కలెక్సన్స్ లో దేవర అడుగుపెట్టబోతున్నాడు. అదే జరిగితే ఇక ఫ్యాన్స్ కే కాదు, కామన్ ఆడియన్స్ కి కూడా ఈ సినిమా ఫ్రీ షో పడబోతోంది..
అంటే ఫ్రీ అంటే కంప్లీట్ ఫ్రీ అని కాదు కాని, ఈ సినిమా ఓటీటీలోకి అందుబాటులోకి రాబోతోంది. బేసిగ్గా ఏమూవీ అయినా పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ అయితే 8 వారాల తర్వాతే ఓటీటీలో అందుబాటులోకి వస్తుంది… అలా చూస్తే, నవంబర్ 15 తర్వాతే దేవర పార్ట్ 1 ఓటీటీలో రావాలి.. ఐతే అక్టోబర్ థర్డ్ వీక్ లో ఈ సినిమా ఓటీటలో వచ్చే అవకాశం ఉందట. ఏకంగా 250 కోట్ల డీల్ నీ రీ అరేంజ్ చేసుకున్నట్టు తెలుస్తోంది. అది కూడా సౌత్ భాషల వరకే.. హిందీ వర్షన్ కి 150 కోట్ల డీల్ సెట్ అయ్యే ఛాన్స్ ఉంది. అదే జరిగితే ఓటీటీ పరంగానే 400 కోట్ల ప్రాఫిట్ దక్కేలాఉంది.