Rudra Karan Partaap: జ్యోతిష్యాన్ని నమ్మేవాళ్ళుంటారు.. నమ్మని వాళ్ళు ఉంటారు.. ఎవరి ఒపీనియన్ వాళ్ళది. కానీ సోషల్ మీడియా వచ్చాక.. సెలబ్రిటీల భవిష్యత్తు గురించి చెప్పే జ్యోతిష్యులు మాత్రం రాత్రికి రాత్రే ఫేమస్ అవుతున్నారు. తెలుగులో వేణు స్వామిలాగే ఇప్పుడు రుద్ర కరణ్ ప్రతాప్ అని మరో ఆస్ట్రాలజర్‌కి ఎక్కడ లేని క్రేజ్ వస్తోంది. ఆయనంతట ఆయనే తెగ బిల్డప్ క్రియేట్ చేసుకుంటున్నాడు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ని కర్మఫలం వెంటాడుతోందనీ.. ఆయన మార్చి 2024లో తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కుంటారని ఆస్ట్రాలజర్ రుద్రకరణ్ ప్రతాప్ గతంలో అంచనా వేశాడట.
Emraan Hashmi: ఫస్ట్ లుక్ రిలీజ్.. ఓజీ’ నుంచి మెంటలెక్కించే పోస్టర్
2022 మార్చి 25న తాను చేసిన ట్వీట్ ఇమేజ్‌ని ట్వీట్ చేస్తూ.. ఇదుగో నేను చెప్పిందే జరిగింది చూశారా అంటున్నాడు. దీంతోపాటు 2022 ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలు, 2022లో పంజాబ్ ఎలక్షన్ రిజల్ట్స్ గురించి కూడా తాను చెప్పిందే కరెక్ట్ అయిందని అంటున్నాడు రుద్రకరణ్ ప్రతాప్. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ఇమ్రాన్ ఖాన్ పతనం కూడా తాను ముందే ఊహించినట్టు ట్వీట్స్ చేస్తున్నాడు. తనను ప్రధాని నరేంద్రమోడీ కూడా ఫాలో అవుతారనీ.. బాలీవుడ్ నటులు, సింగర్స్, పొలిటికల్ లీడర్స్, అధికారులు ఇలా చాలామంది తనతో జాతకం చెప్పించుకున్నట్టు క్లెయిమ్ చేసుకుంటున్నాడు. ఇదంతా బాగానే ఉంది. ఏపీ సీఎంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఎన్నికవుతారని జ్యోతిష్యుడు రుద్ర కరణ్ ప్రతాప్ చెప్పడం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. కేజ్రీవాల్ జోస్యం నిజమైనట్టే.. జగన్ కూడా మళ్ళీ గెలుస్తాడా అనే టాక్ నడుస్తోంది. వైసీపీ శ్రేణులు మాత్రం.. 2024లో జగన్‌దే గెలుపు అంటూ తెగ ప్రచారం చేసుకుంటున్నాయి. రుద్రకరణ్ ట్వీట్స్ పెట్టుకొని సోషల్ మీడియాలో క్యాంపెయిన్ చేసుకుంటున్నాయి.
వచ్చే లోక్ సభ ఎన్నికల్లో తమిళనాడుతో పాటు దక్షిణ భారత దేశంలో బీజేపీ సత్తా చాటుతుందని కూడా రుద్ర ప్రతాప్ చెబుతున్నాడు. కానీ రీసెంట్‌గా ఒక విషయంలో మాత్రం పప్పులో కాలేశాడు. అదేంటంటే.. 2023 మే 29న ఆయన ఓ ట్వీట్ చేశాడు. అందులో వచ్చే తెలంగాణ ఎన్నికల్లో BRS పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందని ట్వీట్ చేశాడు. కానీ సీన్ రివర్స్ అయింది. ఈ విషయంలో మన వేణు స్వామియే బెటర్ అని టాక్ నడుస్తోంది. ఎందుకంటే కేసీఆర్ మళ్ళీ సీఎం కాబోడని అప్పట్లో వేణు స్వామి చెప్పాడట. లేదు.. మీరు కూడా BRS గెలుస్తుందని చెప్పారు కదా అంటే.. ఆ వీడియో ఎక్కడుందో చూపించండి అంటూ సవాల్ చేస్తున్నాడు. అయితే అసలు విషయం ఏంటంటే.. BRS గెలిచినా.. కేసీఆర్ కాకుండా KTR సీఎం అవుతాడని ఓ ఆప్షన్ పెట్టుకున్నాడు వేణుస్వామి. ఏదేమైనా గత నాలుగు రోజులుగా రుద్ర కరణ్ ప్రతాప్, వేణు స్వామి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నారు. మరి ఆంధ్ర విషయంలో రుద్ర చెప్పింది కరెక్ట్ అవుతుందా.. KCR లాగా రివర్స్ కొడుతుందా.. వెయిట్ అండ్ వాచ్.