కన్నడ హీరో దర్శన్ కేసులో రోజుకో సంచలనం వెలుగుచూస్తోంది. ప్రస్తుతం ఈ కేసులో హీరో అరెస్ట్ అయి జైల్లో ఉన్నాడు. రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్.. ప్రస్తుతం జైలు ఊచలు లెక్కిస్తున్నాడు. ఐతే దర్శన్, పవిత్ర, రేణుకాస్వామి మధ్య ఏం జరిగింది.. ఈ ఘోరానికి దారి తీసిన పరిస్థితులు ఏంటి అన్న దానిపై.. పోలీసులు రోజుకో సంచలన విషయం బయటపెడుతున్నారు. రేణుకాస్వామి వేధింపులు.. దర్శన్ ఘోరాలు.. హీరోయిన్ పవిత్ర పడిన వేదనలు.. ఈ కేసులో సంచలనాలు వెలుగుచూసాయ్.
పవిత్రాగౌడ్‌కు రేణుకాస్వామి అసభ్య మెసేజ్‌లు పెట్టేవాడు. తన నగ్న ఫొటోలు పంపిస్తూ.. వల్గర్ కామెంట్లు పెడుతూ విచ్చలవిడిగా ప్రవర్తించాడని పోలీసుల ఇన్వెస్టిగేషన్‌లో తేలింది. ఇన్‌స్టాగ్రామ్‌లో పవిత్రకు పంపించిన మెసేజ్‌లను పోలీసులు బయటపెట్టారు. నీ రేటు ఎంత.. నిన్ను నేను పోషిస్తాను అంటూ మెసేజ్ చేశాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో మొదలైన ఈ వేధింపులతో పవిత్ర విసిగిపోయింది. తన అసిస్టెంట్‌తో కలిసి రేణుకాస్వామిని ఖతమ్ చేయాలని ప్లాన్ చేసింది. రేణుకా స్వామితో మంచిగా మాట్లాడుతూ ఫోన్ నెంబర్ ఇవ్వాలని పవిత్రా కోరింది. దీంతో ఆమె నెంబర్ ఇవ్వాలని రేణుకా స్వామి అడిగాడు. పవిత్ర తన అసిస్టెంట్ పవన్ నెంబర్ ఇవ్వగా… జూన్ 5న రాత్రి రేణుకా స్వామి ఫోన్ చేశాడు.
పవిత్ర పక్కనే ఉండడంతో మాట్లాడి వివరాలు అడిగింది. సోషల్ మీడియాలో మెసేజ్ చేయొద్దని.. వాట్సాప్‌లోనే చాటింగ్ చేసుకుందామని చెప్పింది. ఆ తర్వాత రేణుకా స్వామితో పవిత్ర పేరుతో పవన్ ఛాటింగ్ చేశాడు. వివరాలు రాబట్టేందుకు ప్రయత్నించాడు. ఐతే తప్పుడు వివరాలు చెప్పి.. వారిని రేణుకాస్వామి ఏమార్చాడు. ఓ ఫార్మసీలో పనిచేస్తున్నానని చెప్పడంతో… పవిత్ర అక్కడికి తన మనుషులను పంపించి విచారించింది. రేణుకా స్వామి అక్కడ పనిచేయడం లేదని తెలిసి.. పవన్ మరోసారి ఛాటింగ్‌లో ప్రశ్నించాడు. నిజమైన వివరాలు చెప్తే.. తాను కలుస్తానని పవిత్ర పేరుతో పవన్ మెసేజ్ చేశాడు. అది నమ్మిన రేణుకా స్వామి.. అన్ని వివరాలు మెసేజ్ చేశాడు.
ముందు ఈ విషయం దర్శన్‌కు తెలియకూడదని అనుకున్నా.. తర్వాత తనే స్వయంగా దర్శన్‌కు చెప్పింది పవిత్ర. దీంతో రేణుకా స్వామిని మందలించాలని దర్శన్ అనుకున్నాడు. చిత్రదుర్గంలోని తన అభిమానుల సంఘం అధ్యక్షుడు రాఘవేంద్ర సహకారంతో రేణుకా స్వామిని… జూన్ ఏడో తేదీ రప్పించేందుకు ప్రయత్నించాడు. ఐతే అది కుదరలేదు. దీంతో జూన్ 8న అనుచరులను పంపించి రేణుకా స్వామిని కిడ్నాప్ చేయించాడు. నిజానికి రేణుకా స్వామిని మందలించేందుకే తీసుకొచ్చినా.. అతడిని చూశాక కోపం పట్టలేక దర్శన్ అనుచరులతో కలిసి దాడి చేశాడు. దీంతో తీవ్ర గాయాలతో రేణుకాస్వామి చనిపోయాడు.