Avika Gor: చిన్నారి పెళ్లి కూతురుకు మళ్లీ మళ్లీ పెళ్లి..? ఎందుకు..?

అప్పుడప్పుడు వెబ్ సిరీస్‌లలో మెరుస్తున్న అవికా.. లేటెస్ట్‌గా వధువు అనే సిరీస్‌తో వచ్చింది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సిరీస్‌లో నందు, అలీ రేజా ఇంపార్టెంట్ రోల్స్‌లో కనిపించారు. బెంగాలీ వెబ్ సిరీస్ 'ఇందు'కి రీమేక్‌గా వచ్చిన వధువు స్టోరీ ఏంటంటే..

  • Written By:
  • Publish Date - December 8, 2023 / 03:46 PM IST

Avika Gor చిన్నారి పెళ్లికూతురు అవికా గోర్‌కి మళ్లీ మళ్లీ పెళ్లి. ప్రస్తుతం ఇదే ట్రెండింగ్. పెళ్లి మళ్లీ మళ్లీ ఏంటి అంటారా.. ఇదంతా రియల్ కాదులెండి.. కొత్త వెబ్ సిరీస్ వధువులో అవికా కష్టాలివి. డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సిరీస్ ఎలా ఉందో తెలుసుకుందాం. ‘చిన్నారి పెళ్లి కూతురు’ సీరియల్‌తో తెలుగు సిల్వర్ స్క్రీన్‌పై ఓ వెలుగు వెలిగిన అవికా గోర్.. ఉయ్యాల జంపాల సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టింది. ఆ తర్వాత వరుస అవకాశాలు సంపాదించుకుంది. కానీ, సిల్వర్ స్క్రీన్‌పై కెరీర్ ఆశించిన స్థాయిలో దూసుకెళ్లలేదు.

MEGASTAR CHIRANJEEVI: మెగాస్టార్ ఇంటికి నెట్‌ఫ్లిక్స్ సీఈవో.. రామ్ చరణ్ కోసమే కదా!

అప్పుడప్పుడు వెబ్ సిరీస్‌లలో మెరుస్తున్న అవికా.. లేటెస్ట్‌గా వధువు అనే సిరీస్‌తో వచ్చింది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సిరీస్‌లో నందు, అలీ రేజా ఇంపార్టెంట్ రోల్స్‌లో కనిపించారు. బెంగాలీ వెబ్ సిరీస్ ‘ఇందు’కి రీమేక్‌గా వచ్చిన వధువు స్టోరీ ఏంటంటే.. ఇందుగా నటించిన అవికా గోర్‌కు కాబోయే భర్తను సొంత చెల్లెలు లేవదీసుకుని వెళ్లిపోతుంది. ఆ పెళ్లి ఆగిపోతుంది. రెండోసారి నందుతో పెళ్లి కుదిరిందంటే ఏకంగా పెళ్లి పత్రికతో చెల్లెలు దిగుతుంది. ఇంకోవైపు ఇందు-నందు పెళ్లి ఆపాలనే ప్రయత్నాలు జరుగుతుంటాయి. ఇంతకీ పెళ్లి ఆపాలని ప్రయత్నించింది ఎవరు? ఇందు అత్తారింట్లో అడుగుపెట్టాక ఆమె అనుకుని తన ఆడపడుచుపై హత్యాప్రయత్నం ఎందుకు జరిగింది? నందు తమ్ముడిగా నటించిన అలీ రెజా పెళ్లి ఎందుకు పెటాకులైంది? అత్తారింట్లో ఇందుకి ఎదురైన సంఘటనలేంటి? అన్నదే స్టోరీ.

Extra Ordinary Man Review: నితిన్ ఎక్స్ ట్రా ఆర్డినరీ హిట్ కొట్టినట్టేనా..!

సిరీస్ ఆరంభం నుంచి సస్పెన్స్ క్రియేట్ చేసి చివరి వరకూ అదే సస్పెన్స్ మెంటైన్ చేయడంలో డైరెక్టర్ పోలూరి కృష్ణ సక్సెస్ అయ్యాడు. లాజిక్కుల గురించి పెద్దగా ఆలోచించకుండా కథతో పాటూ ఆడియన్స్ ప్రయాణం చేసేలా ఉంది వధువు. పెళ్లి మండపంలో అమ్మాయి బాబాయ్ వచ్చి ‘అన్నయ్యా..’ అన్న ప్రతిసారీ ‘మళ్ళీ పెళ్లి ఆగింది’ అని మనకు అర్థమైపోతుంది. తక్కువ సీన్స్ లోనే కథ చెప్పేయాలనే ఆతృతతో కొన్ని కథలను అసంపూర్తిగా ముగించారు. ఫైనల్ గా అసలు దోషి ఎవరో చెప్పకుండా వధువు సీజన్ 1 కి ఎండ్ కార్డ్ వేసేశారు. అయితే వథువు స్టోరీ కన్నా దాన్ని నడిపించిన తీరుకి ప్రేక్షకులు కనెక్ట్ అయిపోతారు. శ్రీరామ్ మద్దూరి BGM స్పెషల్ ఎఫెక్ట్. అవికా గోర్ నటనకు అస్సలు వంక పెట్టలేం.

కళ్లతోనే ఎక్స్‌ప్రెషన్స్ పలికిస్తూ తన క్యారెక్టర్‌కు పూర్తిగా న్యాయం చేసింది అవికా. యాంగ్రీ యంగ్ మేన్ గా నందు, యాక్టివ్ గా ఉండే రోల్ లో అలీ రెజా బావున్నారు. మిగిలిన వారంతా తమ పాత్రల పరిధి మేరకు నటించారు. ఓవరాల్‌గా చెప్పుకుంటే వధువు వెబ్ సిరీస్ ఈ వీకెండ్‌కి మంచి టైమ్ పాస్ అవుతుంది. నిడివి తక్కువే కాబట్టి.. ఓ సినిమా చూసిన టైమ్‌లో.. అంటే రెండున్న గంటల్లో మొత్తం సిరీస్ చూసేయవచ్చు. టైమ్ తెలియకుండా గడిచిపోతుంది.