Baby Movie: దర్శకుడే నిర్మాతగా మరోసారి బేబీ కాంబినేషన్.. విడుదల ఎప్పుడంటే..

ఆనంద్, వైష్ణవి జంటగా కొత్త సినిమా తెరకెక్కుతోంది. అయితే, బేబీ సినిమా రూపొందించిన సాయి రాజేశ్ ఈ చిత్రానికి కథ అందించడంతోపాటు సహ నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. బేబీ నిర్మించిన ఎస్కేఎన్ మరో నిర్మాతగా ఉండనున్నారు.

  • Written By:
  • Publish Date - October 20, 2023 / 07:47 PM IST

Baby Movie: ఈ ఏడాది తెలుగులో సంచలన విజయం సాధించిన చిత్రాల్లో బేబీ ఒకటి. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా సాయి రాజేశ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇప్పుడీ కాంబినేషన్ మరోసారి రిపీట్ కానుంది. ఆనంద్, వైష్ణవి జంటగా కొత్త సినిమా తెరకెక్కుతోంది. అయితే, బేబీ సినిమా రూపొందించిన సాయి రాజేశ్ ఈ చిత్రానికి కథ అందించడంతోపాటు సహ నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు.

బేబీ నిర్మించిన ఎస్కేఎన్ మరో నిర్మాతగా ఉండనున్నారు. ఈ చిత్రం ద్వారా రవి నంబూరి దర్శకుడిగా మారుతున్నారు. రవి గతంలో 3 రోజెస్ వెబ్ సిరీస్‌కు, ప్రతిరోజూ పండుగే వంటి సినిమాలకు రచయితగా, దర్శకత్వ విభాగంలో పని చేశారు. బేబీ చిత్రానికి సంగీతం అందించిన విజయ్ బుల్గానిన్ ఈ సినిమాకు కూడా మ్యూజిక్ చేస్తున్నాడు. దాదాపు ఎక్కువ మంది టెక్నీషియన్లు బేబీ సినిమాకు పని చేసిన వాళ్లే ఈ కొత్త చిత్రానికీ పని చేయబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను చిత్ర యూనిట్ తాజాగా రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ చూస్తుంటే ఇది కూడా ప్రేమకథగానే రూపొందుతున్నట్లు అర్థమవుతోంది. తాజాగా షూటింగ్ ప్రారంభమైన ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్‌లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు.

బేబీ చిత్రం ఆనంద్‌, వైష్ణవికి మంచి పేరు తెచ్చింది. సక్సెస్ అందించడమే కాకుండా.. నటులుగానే గుర్తింపు దక్కేలా చేసింది. యువ ప్రేక్షకులు ఈ చిత్రానికి భారీ విజయాన్ని అందించారు. మరోసారి బేబీ కాంబో రిపీట్ కానుండటంతో ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదరిస్తారని మూవీ యూనిట్ నమ్ముతోంది.