ఇండస్ట్రీలో ఎన్నో జంటలు ప్రేమ వివాహాలు చేసుకుని.. తర్వాత విడిపోతున్నాయి. బాలీవుడ్ క్యూట్ పెయిర్లో ఒకరైన అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ విడాకుల వార్తలు బీటౌన్ ను మరోసారి కుదిపేస్తున్నాయి. గంతంలో కూడా వీరి గురించి రకరకాల వార్తలు రాగా.. వాటిపై అమితాబ్ ఫ్యామిలీ నుంచి క్లారిటీ కూడా వచ్చింది. ఇక తాజాగా మరోసారి విడాకుల వార్తలు వైరల్ అయ్యాయి. అయితే ఈ విడాకులు వార్తలకు రకరకాల కారణాలు బయటకు రావడం హాట్ టాపిక్ గా మారింది.
ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ లు ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారని గత కొంత కాలంగా ఏదో ఒక వార్త ఎప్పుడూ నెట్టింట్లో చక్కర్లు కొడుతూనే ఉంటాయి. పైగా ఎక్కడికి వెళ్లినా జంటగా కనిపించే ఈ ఇద్దరు ఈ మధ్య మాత్రం కలిసి కనిపించడం లేదు. దీంతో ఐశ్వర్యా రాయ్ బచ్చన్ ఇంటి నుంచి బయటకు వచ్చిందని..సపరేట్గా ఉంటుందనే వార్త బీటౌన్‌లో చక్కర్లు కొడుతోంది. ఇక ఐశ్వర్య రాయ్ తన పుట్టింటి వారి గురించి..తన బిడ్డ ఆరాధ్య గురించి మాత్రమే ఆలోచిస్తుందట. వారి బాగోగులు మాత్రమే చూసుకుంటుందట. చాలా ఏళ్ల నుంచి ఐశ్వర్య, అభిషేక్‌ల మధ్య పొసగడం లేదని, కానీ ఆ బిడ్డ కోసం ఇన్నాళ్లు ఇలా కలిసి ఉన్నారని బీ టౌన్లో గాసిప్స్ వినిపిస్తూనే ఉంటాయి. ఈ ఇద్దరి మధ్య ఇప్పటికీ సయోధ్య కుదరలేదని, ఇంట్లో సైతం అత్తా కోడళ్ల మధ్య పడటం లేదని, ఇక గొడవలు తారస్థాయికి వెళ్లాయని అందుకే ఇలా ఐశ్వర్య బయటకు వచ్చిందంటూ రకరకాలుగా వార్తలను అల్లేస్తోంది బీటౌన్ మీడియా ..
మొన్నీమధ్యే అభిషేక్ బచ్చన్ నటించిన వెబ్ సిరీస్ స్పెషల్ ప్రీమియర్‌లో బచ్చన్ ఫ్యామిలీ అంతా కనిపించింది. ఐశ్వర్య, జయా బచ్చన్, అమితాబ్, అభిషేక్ ఇలా అందరూ మీడియా ముందు సందడి చేశారు. ఆ టైంలో అభిషేక్ ఐశ్వర్యలు కలిసి పక్కపక్కన కూడా నిల్చోవడం లేదని.. ఐశ్వర్య జయా బచ్చన్లు కనీసం చూసుకోవడం కూడా లేదన్న వార్త చక్కర్లు కొడుతుంది. అంతేకాక భర్త అభిషేక్ ఐష్ ప్రేమగా ఇచ్చిన ఉంగరం కూడా పెట్టుకోవడం లేదని టాక్ నడుస్తోంది.అంతేకాక మామ అయిన అమితాబ్ బచ్చన్ కూడా సోషల్ మీడియాలో ఐశ్వర్యరాయ్‌ను అన్ ఫాలో చేశాడు. దీంతో ఈ విడాకుల టాపిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రీసెంట్ గా ఐశ్వర్య రాయ్ తన 50 వ పుట్టినరోజు జరుపుకోగా.. అభిషేక్ ఆ వేడుకలల్ల కనిపించలేదు. ఐశ్వర్య సియోన్ జీఎస్బీ సేవా మండల్ల్లోని క్యాన్సర్ పేషెంట్ల మధ్య ఐశ్వర్య ఈ వేడుక చేసుకున్నారు. ఈ వేడుకలో కూడా ఐశ్వర్య తల్లి బృందా రాయ్, కూతురు ఆరాధ్య మాత్రమే కనిపించారు. ఈ వేడుకలకు సైతం అభిషేక్ హాజరు కాకపోవడం.. ఐశ్వర్యకు పుట్టినరోజు విషెస్ చాలా లేట్‌గా చెప్పడం .. ఇవన్నీ గమనించిన ఫ్యాన్స్ వీరి మధ్య ఏదో జరుగుతోంది అని అంటున్నారు. నిజంగా వీరు విడాకులుతీసుకోబోతున్నారా అనే అనుమానాలువ్యాక్తం చేస్తున్నారు.