బాలీవుడ్ స్టార్ జంట ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ ల మధ్య వైవాహిక జీవితం ఇక ముగిసినట్టేనా…? అంటే అవుననే సమాధానం వినపడుతోంది. ఐశ్వర్య రాయ్ ను అభిషేక్ దగ్గర చేసుకోవాలని చూస్తున్నా ఆమె మాత్రం దూరం కావడానికే సిద్దంగా ఉన్నట్టు క్లారిటీ వస్తోంది. దాదాపు ఏడాది నుంచి వీరి వైవాహిక జీవితంపై ఎన్నో రూమర్స్ వస్తూనే ఉన్నాయి. కాని ఎవరి నుంచి క్లారిటీ మాత్రం లేదు. ఐశ్వర్య ఎక్కడికి వెళ్ళినా తన కూతురు ఆరాధ్యతో మాత్రమే వెళ్తోంది. విదేశాలకు కూడా ఒంటరిగానే వెళ్తోంది.
తన క్లోజ్ ఫ్రెండ్… ఓ డాక్టర్ ను ప్రేమిస్తుందని అతన్ని వివాహం చేసుకునే అవకాశం ఉందనే వార్తలు సోషల్ మీడియాలో గుప్పుమన్నాయి. ఇదే టైం లో నిమ్రత్ కౌర్ ను అభిషేక్ వివాహం చేసుకునే అవకాశం ఉందని… ఆమెకు 40 ఏళ్ళు వచ్చినా వివాహం కాలేదు కాబట్టి… కచ్చితంగా అభిషేక్ ను వివాహం చేసుకునే సూచనలు ఉన్నాయి అంటూ వార్తలు వస్తున్నాయి. దీనిపై రీసెంట్ గా అభిషేక్ క్లారిటీ ఇచ్చాడు. పెళ్లి తర్వాత… ఫ్యామిలీపై ఐశ్వర్య ఫోకస్ చేస్తుంది కాబట్టి తాను ఫ్రీగా సినిమాలు చేస్తున్నా అని క్లారిటీ ఇచ్చాడు.
ఇక ఐశ్వర్య లేకపోతే తాను కెరీర్ పరంగా చాలా ఇబ్బందులు పడే వాడిని అంటూ చెప్పుకొచ్చాడు. ఈ టైం లో ఐశ్వర్య రాయ్ పేరులో బచ్చన్ తొలగించడం సంచలనం అయింది. ఇటీవల యూఏఈలో జరిగిన దుబాయ్ గ్లోబల్ ఉమెన్స్ ఫోరమ్ ఈవెంట్‌కు ఐశ్వర్యరాయ్ హాజరయ్యారు. మహిళా సాధికారత గురించి ఆమె చేసిన ప్రసంగం ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయింది. అయితే ఆమె ప్రసంగం కంటే ఓ విషయం ఇక్కడ బాగా ఫేమస్ అయింది. ఆమె ఈవెంట్లో తన ఐశ్వర్య రాయ్ బచ్చన్ గా కాకుండా ఐశ్వర్య గానే పరిచయం చేసారు.
స్క్రీన్ పై కూడా ఆమె పేరు ఐశ్వర్య రాయ్ అనే ఉంది. ‘ఐశ్వర్య రాయ్ – ఇంటర్నేషనల్ స్టార్’ ఓ డిజిటల్ నేమ్ ఉన్న ఓ డిజిటల్ బ్యానర్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆ గ్రాఫిక్ బ్యానర్ ముందు ఆమె నిలబడింది. ఐశ్వర్య తన అధికారిక పేరు నుండి బచ్చన్‌ను తొలగించిందా? అంటూ సోషల్ మీడియా ఇప్పుడు ఊగిపోతుంది. ఐశ్వర్య, అభిషేక్ విడిపోలేదు అని బచ్చన్ ఫ్యామిలీ పదే పదే చెప్పే ప్రయత్నం చేస్తోంది. అయినా సరే ఇటువంటి పరిణామాలు హీట్ పెంచేస్తున్నాయి. దీనిపై అమితాబ్ కూడా ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. “ఊహాగానాలు, అనుమానాలు, ఏ విధమైన క్లారిటీ లేకుండా ఊహాజనిత అవాస్తవాలను అనవసరంగా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వాళ్ళు ఇద్దరూ విడిపోయారు అనే వార్తలు చదువుతుంటే కామెడీగా ఉందని అమితాబ్ కొట్టిపారేశారు.