బన్నీ – త్రివిక్రమ్ కాంబో బ్యాక్ డ్రాప్ ఇదే, లైన్ లో పడ్డ గురూజీ

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్... మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా అంటే మాస్ ఆడియన్స్ తో పాటుగా క్లాస్ ఆడియన్స్ లో ఓ రేంజ్ లో క్రేజ్ ఉంటుంది. సినిమా కథ ఎలా ఉన్నా సరే... మాటలతో సినిమాను నెట్టుకు రావడం, చిన్న చిన్న ట్విస్ట్ లతో సినిమాను అన్ని వర్గాలకు దగ్గరయ్యేలా తీయడం...

  • Written By:
  • Publish Date - November 18, 2024 / 01:37 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్… మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా అంటే మాస్ ఆడియన్స్ తో పాటుగా క్లాస్ ఆడియన్స్ లో ఓ రేంజ్ లో క్రేజ్ ఉంటుంది. సినిమా కథ ఎలా ఉన్నా సరే… మాటలతో సినిమాను నెట్టుకు రావడం, చిన్న చిన్న ట్విస్ట్ లతో సినిమాను అన్ని వర్గాలకు దగ్గరయ్యేలా తీయడం… వీరి కాంబినేషన్ లో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. వీరి కాంబినేషన్ లో వచ్చిన మూడు సినిమాలు… జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.

బన్నీకి వరుస ఫ్లాప్ లు ఉన్న సమయంలో త్రివిక్రమ్… భారీ హిట్ లు అందించాడు. ఇప్పుడు బన్నీ ఐకాన్ స్టార్ అయిపోయాడు. పుష్ప సీరీస్ తో బన్నీ రేంజ్ పెరిగిపోయింది. పుష్ప 2 హిట్ అయితే మాత్రం ఇక పాన్ ఇండియా లెవెల్ లో బన్నీకి తిరుగు ఉండదు. పుష్ప ప్రమోషన్స్ తో బన్నీ బిజీగా ఉన్నాడు. నార్త్ ఇండియాపై ఎక్కువగా ఫోకస్ చేసి ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తున్నారు. ఇండియా వైడ్ గా మొత్తం ఏడు స్టేట్స్ లో ఈవెంట్స్ చేయనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు మేకర్స్.

పాట్నాలో ట్రైలర్ ను గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసారు. ఇప్పటికే ఐటెం సాంగ్ ను కూడా ఫినిష్ చేసారు మేకర్స్. త్వరలోనే సాంగ్స్ కూడా రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఇక్కడి నుంచి ప్రతీ ఒక్క అప్డేట్ క్రేజీగానే ఉండనుంది. ఈ నేపధ్యంలో త్రివిక్రమ్ తో చేయబోయే సినిమా ఎలా ఉంటుంది అనే చర్చలు కూడా జరుగుతున్నాయి. గత కొన్నాళ్ళుగా త్రివిక్రమ్ కు సరైన హిట్ లేదు. ఆయన… పవన్ కళ్యాణ్ సినిమాలకే వర్క్ చేస్తూ వస్తున్నారు. గుంటూరు కారం సినిమా అంతగా ఆకట్టుకోలేదు.

ఇప్పుడు బన్నీ ఫాంలో ఉన్నప్పుడు భారీ ప్రాజెక్ట్ అనేసరికి భయం మొదలయింది జనాల్లో. బన్నీ, త్రివిక్రమ్ ప్రాజెక్ట్ 2025లో పట్టాలెక్కనుందని ఇప్పటికే ప్రకటించారు. త్రివిక్రమ్ స్క్రిప్ట్ వర్క్ ఫినిష్ చేస్తున్నారు. జనవరి నుంచి షూట్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక ఈ సినిమాతో త్రివిక్రమ్ ట్రెండ్ ఫాలో కావడానికి రెడీ అవుతున్నారు. కొత్త లోకాన్ని చూపించేందుకు గురూజీ రెడీ అయ్యారు. త్రివిక్రమ్ కు ఇది ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కావడంతో హిస్టారికల్ ఎలిమెంట్స్‌ ను చూపించే ప్లాన్ చేస్తున్నారు. వాటిని మైథలాజికల్ టచ్‌తో చూపించేందుకు సిద్దమయ్యారు. హిస్టారికల్ వారియర్ ‘చెంఘీజ్ ఖాన్’ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమాను ప్లాన్ చేసినట్టు టాక్.