రెబల్ స్టార్ ప్రభాస్ తో మారుతి తీస్తున్నమూవీ ది రాజా సాబ్. 80శాతం పూర్తైన ఈ సినిమా షూటింగ్, ప్రజెంట్ హోల్డ్ లో ఉంది. సంక్రాంతి తర్వాత ప్రభాస్ మళ్లీ సెట్లో అడుగుపెడతాడడి తెలుస్తోంది. సో 40 రోజుల్లో ది రాజా సాబ్ షూటింగ్ పూర్తయ్యేలా ఫిల్మ్ టీం కొత్త షెడ్యూల్ ప్లాన్ చేసింది. ప్రజెంట్ గాయం నుంచి కోలుకునేందుకు రెస్ట్ తీసుకుంటున్నా ప్రభాస్, తిరిగి సెట్లోకి వచ్చే లోపే, 100 కోట్ల మహల్ ని రెడీ చేస్తోంది సినిమాటీం. ఈ గ్యాప్ ని అలా వాడుకుంటున్నారట. ఏకంగా 8 అంతస్తులతో స్టీల్ కేజెస్ తో ఈ సెట్ ని రెడీ చేస్తున్నారని తెలుస్తోంది. కేవలం 15 రోజుల్లోనే ఈ సెట్ రెడీ అవుతుందని కూడా ప్రచారం జరుగుతోంది. ఆమధ్య చైనాలో కేవలం 30 రోజుల్లోనే 10 అంతస్థుల స్టీల్ బిల్డింగ్ కట్టారు.. అలాంటి రికార్డే ది రాజా సాబ్ విషయంలో క్రియేట్ అయ్యేలా ఉంది. ఇక క్లైమాక్స్ ని ఈ సెట్లోనే పూర్తి చేస్తారని కూడా తెలుస్తోంది.ఐతే బాహుబలి, కల్కీ ని మించేలా ది రాజా సాబ్ లో క్లైమాక్స్ ఉండబోతోందట. ఇంత కాన్ఫిడెంట్ గా చెప్పటానికి కారణం ఇది కేవలం హర్రర్ కామెడీ మాత్రమే కాకపోవటం… యాక్షన్ పార్ట్ కూడా గట్టిగానే ప్లాన్ చేసిన టీం, ఆ యాక్షన్ సీక్వెన్స్ కోసమే ఇప్పుడు 100 కోట్లు ఖర్చే చేయబోతోంది.
ది రాజా సాబ్ మూవీ అంటే మొదటి నుంచి ఇదో హర్రర్ కామెడీ కాబట్టి, మరో డార్లింగ్ లేదంటే రెబల్ స్టార్ జస్ట్ లైక్ దట్ మూవీ అన్నట్టుగానే చూస్తూ వస్తున్నారు. మరి ఇది నిజంగా అలాంటి కంటెంటే అయితే, ఎందుకు కేవలం క్లైమాక్స్ కోసం సింగిల్ సెట్ కి వందకోట్లు ఖర్చు చేస్తారు. రెబల్ స్టార్ సెట్లో అడుగుపెట్టాక అది చిన్న సినిమా, పెద్ద సినిమా అని ఉండదు.. ఏమూవీ అయినా పాన్ ఇండియా ప్రాజెక్టే…
అయితే ఇక్కడ కొత్త విషయం ఏంటంటే, ది రాజా సాబ్ లో 100 కోట్ల ఖర్చుతో 8 అంతస్తుల మహాల్ సెట్ వేస్తున్నారని రెండు నెలలుగా ప్రచారం జరుగుతోంది. క్లైమాక్స్ లో ఆ మహల్ ని కూల్చే సీన్ ఓరేంజ్ లో ఉంటుందనే టాక్ పెరిగింది.
కాకపోతే ఇక్కడ అన్నీంటికంటే హైలెట్ అప్ డేట్ ఏంటంటే, ఈ సెట్ ని 15 రోజుల్లోనే వేస్తారట. గిన్నీస్ బుక్ ప్రతినిధులని పిలిచి, వాళ్ల సమక్షంలోనే 15 రోజుల్లో 8 అంతస్తుల స్టీల్ గ్రిల్స్ తో సెట్ వేయటం జరుగుతుందని తెలుస్తోంది
చైనాలో 30రోజుల్లో 10 అంతస్థుల స్టీల్ బిల్డింగ్ ని కట్టినట్టే, 15 రోజుల్లో 8 అంతస్థుల స్టీల్ బిల్డింగ్ కట్టడమే కాదు, దాన్ని మహళ్ గా కూడా సెట్ రూపంలో మారుస్తారు.. ఇదంతా గిన్నీస్ బుక్ ప్రతినిధుల సమక్షంలో జరగబోతోంది. సినిమాకు ఈ గిన్నిస్ రికార్డుకి ఏమైనా లింకుందా అంటే, రికార్డు ఏదైనా రికార్డే కాబట్టి, 100 కోట్ల ఖర్చుని ఇలా సినిమా రిలీజ్ కి ముందే ప్రాఫిట్ గా మారుస్తోంది ఫిల్మ్ టీం
అంతేకాదు రెబల్ స్టార్ ఎన్ని పాన్ ఇండియా హిట్లు సొంతం చేసుకున్నా, బాహుబలి రేంజే వేరు. బాహుబలి మొదటి భాగం, రెండో భాగాన్ని కథ, కథనం ఎంతగా నెక్ట్స్ లెవల్ కి తీసుకెళ్లాయో, గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ అంతకు మించి అనిపించేలా చేశాయి. అలాంటి సినిమానే మించేలా సెట్లు, విజువల్ ఎఫెక్ట్స్ ది రాజా సాబ్ లోఉండబోతున్నాయట. 80శాతం పూర్తైన ఈ సినిమా షూటింగ్ ని, మరో 40రోజులు లాంగ్ షెడ్యూల్ తో పూర్తి చేసేందుకు రంగం సిద్దమైంది. గాయం నుంచి కోలుకుంటున్న ప్రభాస్, సంక్రాంతి తర్వాత సెట్లో అడుగుపెట్టగానే, ది రాజా సాబ్ షూటింగ్ గుమ్మడి కాయ కొట్టే వరకు లాంగ్ షెడ్యూల్ షూటింగ్ జరుగుతూనే ఉంటుందట.