Balakrishna Fans: బాలయ్య ఫ్యాన్స్ ను కంగారు పెడుతున్న అనిల్ రావిపూడి!

బోయపాటి శీను, గోపీచంద్ మలినేని లాంటి వాళ్లు తప్ప మరెవరూ బాలయ్య లుక్ ని సరిగా చూపించలేకపోయారు. అనిల్ మాత్రం బాలయ్యని వెరైటీగా చూపించబోతున్నాడు. ఏమాత్రం అటు ఇటు అయినా తేడా కొడుతుంది. అందుకే సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఫైర్ అవటం, కంగారు పడటం కనిపిస్తోంది.

  • Written By:
  • Publish Date - February 28, 2023 / 04:56 PM IST

నటసింహం బాలయ్య వీరసింహా రెడ్డి హిట్ తర్వాత అనిల్ రావిపుడి మేకింగ్ లో సినిమా చేయబోతున్నాడు. మార్చ్ ఫస్ట్ వీక్ ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కి థర్డ్ వీక్ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. అంతా బానే ఉంది. ఇలాంటప్పుడు ఫ్యాన్స్ పండగ చేసుకోవాలి.. కాని దర్శకుడి మీద ఫైర్ అవుతున్నారట.

కారణం ఈమూవీలో బాలయ్య 60 ఏళ్ల సీనియర్ సిటిజన్ రోల్ వేయటం. 46 ఏళ్ళ వయసులో 14 ఏళ్ల జైలు జీవితం గడిపి, రిలీజ్ అయ్యాక రివేంజ్ తీసుకోవాల్సి వస్తే ఎలా ఉంటుంది.. అలాంటి తండ్రి పాత్రలో బాలయ్య, కూతురిగా శ్రీలీలా నటించబోతోంది. ఐతే ఇక్కడ ఫ్యాన్స్ లో కంగారుకి కారణం, బాలయ్య 60 ఏళ్ల వాడిగా.. అది కూడా విగ్ లేకుండా కనిపించబోతుండటం.

బాలయ్య డ్యూయెల్ రోల్స్ వేసి అందులో తండ్రి, కొడుకుల పాత్రలంటే ఓకే కాని, ఒకే పాత్ర అది కూడా 60 ఏళ్ల వ్యక్తి రోల్ అంటేనే ఫ్యాన్స్ లో చర్చ మొదలైనట్టుంది. సోషల్ మీడియాలో బాలయ్య ఫ్యాన్స్ ఇప్పుడిదే డిస్కస్ చేసుకుంటున్నాు. బేసిగ్గా బాలయ్య విగ్స్ మీద కామెంట్స్ వస్తుండేవి.. బోయపాటి శీను, గోపీచంద్ మలినేని లాంటి వాళ్లు తప్ప మరెవరూ బాలయ్య లుక్ ని సరిగా చూపించలేకపోయారు. వాళ్లే అంత కష్టపడి గట్టెక్కితే, అనిల్ మాత్రం అసలు విగ్ లేకుండా, అది కూడా 60ఏళ్ళ వాడిగా బాలయ్యని చూపించబోతున్నాడు. ఏమాత్రం అటు ఇటు అయినా తేడా కొడుతుంది. అందుకే సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఫైర్ అవటం, కంగారు పడటం కనిపిస్తోంది.