టాలీవుడ్ లో నందమూరి బాలకృష్ణది కచ్చితంగా డిఫరెంట్ స్టైల్. ఆయన ఏం చేసినా కాస్త డిఫరెంట్ గానే ఉంటుంది. సోషల్ మీడియాలో ఎవరైనా కామెంట్స్ చేసిన బాలకృష్ణ మాత్రం తాను చేసేవి చేస్తూనే ఉంటారు. ఇండస్ట్రీలో కాస్త ఆయనకు మంచి పేరు ఉంది. దీంతో బాలకృష్ణ మాటకు టాలీవుడ్ లో కాస్త ఎక్కువగానే గౌరవం కూడా ఉంటుంది. ఎటువంటి వివాదాల్లో బాలకృష్ణ తలదూర్చే ప్రయత్నం కూడా చేయరు. రీసెంట్ గా అల్లు అర్జున్ వ్యవహారంలో కూడా బాలకృష్ణ ఎక్కడా మాట్లాడే ప్రయత్నం చేయలేదు.
అలాగే సినిమా పరిశ్రమ తెలంగాణ ప్రభుత్వంతో రాజీ పడే ప్రయత్నం చేసినా ఆ సమావేశంలో బాలకృష్ణ పాల్గొనలేదు. కొంతమంది స్టార్ హీరోలు వెళ్లిన సరే బాలకృష్ణ మాత్రం వెళ్లడానికి ఇష్టపడలేదు. గతంలో కూడా ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ జగన్ సినిమా పరిశ్రమను ఇబ్బంది పెట్టే సమయంలో కూడా బాలకృష్ణ వెళ్లి జగన్ తో సమావేశం కావడానికి ఏమాత్రం ఇష్టపడలేదు. ప్రస్తుతం బాలకృష్ణ డాకు మహారాజ్ అనే సినిమాలో నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయడానికి మేకర్స్ రెడీ అయ్యారు.
అయితే ఈ సినిమా ప్రమోషన్స్ కోసం కొంత మందిని బాలయ్య ఇన్వైట్ చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. కన్నడ నుంచి శివరాజ్ కుమార్ అలాగే తమిళం నుంచి రజినీకాంత్ ను ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు ఇన్వైట్ చేసే ఆలోచనలో బాలకృష్ణ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనికి తెలుగు వాళ్ళను ఎవరిని ఇన్వైట్ చేసే ఆలోచనలో బాలయ్య లేరట. ప్రస్తుతం టాలీవుడ్ లో చోటు చేసుకున్న పరిణామాలతో అనవసరంగా తాను ఎందులో అయినా జోక్యం చేసుకుంటే తనపై విమర్శలు వచ్చే అవకాశం ఉందని బాలయ్య కాస్త టాలీవుడ్ ను పక్కన పెడుతున్నట్టు తెలుస్తోంది.
అఖండ సినిమా తర్వాత ఇతర భాషల్లో బాలయ్యకు మంచి మార్కెట్ పెరిగింది. ఇప్పుడు ఆ మార్కెట్ను మరింత పెంచుకోవడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. నందమూరి హీరోల సినిమాలకు కన్నడ, తమిళంలో మంచి రెస్పాన్స్ ఉంటుంది. అందుకే తన సినిమాల మార్కెట్ ను పెంచుకోవడానికి బాలయ్య కాస్త కష్టపడుతున్నారు. అఖండ సీక్వెల్ని కూడా గ్రాండ్ గానే ప్లాన్ చేస్తున్నారు. ఇక్కడ డాకు మహారాజ్ సినిమా సూపర్ హిట్ అవుతుందని కాన్ఫిడెన్స్ బాలయ్య లో కూడా కనబడుతోంది. ఈ సినిమా కోసం దాదాపు రెండేళ్ల నుంచి ఆయన కష్టపడుతున్నారు. ఆటో డైరెక్టర్ బాబి కూడా ఈ సినిమా విషయంలో పక్కా లెక్కలతో ప్లానింగ్ చేసుకున్నాడు. ఇప్పటివరకు ఇండియన్ సినిమాలో లేని కాన్సెప్ట్ ను ఈ సినిమాలో చూపించేందుకు బాబీ రెడీ అయ్యాడు.