పాన్ ఇండియా నెంబర్ వన్ కింగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి 1200 కోట్ల వసూళ్ల సందడి తెచ్చిన మూవీ కల్కీ. దీని సీక్వెల్ వచ్చే ఏడాది దసరాకు షురూ కావొచ్చని రెండుమూడు నెలలుగా ప్రచారం జరుగుతోంది. ఫౌజీ సెట్లో తనకు గాయాలైనా, ది రాజా సాబ్ షూటింగ్ పూర్తికావొస్తున్నా, కల్కీ సీక్వెల్ తాలూకు ప్రచారం ఆగలేదు. ఐతే ఇప్పుడు సడన్ గా సీన్ లోకి నటసింహం బాలయ్య వచ్చాడు. కల్కీ 2 ప్రాజెక్టుకు ఏకంగా ఏడాది వాయిదా పడేలా బ్రేకులేశాడు. రెబల్ స్టార్ ప్రభాస్ కి కూడా నటసింహం నుంచి కాల్ వెళ్లినప్పటి నుంచే ఇండస్ట్రీలో ఈ చర్చ మొదలైంది. కల్కీ 2 ని దసరాకు షురూ చేయాలనుకుంటున్న టీంని ఎందుకు మరో ఏడాది వెనక్కి వెళ్లేలా బాలయ్య నిర్ణయం తీసుకున్నాడు..? తన మాటని ప్రభాస్ మాత్రమే కాదు దర్శక నిర్మాతలు కూడా ఒప్పుకోవటానికి కారణం ఏంటి? అందుకు బాలయ్య చేసిన రిక్వెస్ట్ ఇంకేంటి?
రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ హీరోయిన్ దీపికా, హిందీ మెగా స్టార్ అమితాబ్ బచ్చన్ , లోకనకాయకుడు కమల్ హాస్ ఈ కాంబోలో వచ్చిన కల్కీ 1200 కోట్లు రాబట్టింది. పార్ట్ 2 పట్టాలెక్కాలంటే ప్రెగ్నెంట్ అయిన దీపికా కోసం ఇంకొంత కాలం షూటింగ్ ని వాయిదా వేస్తున్నామని టీం తేల్చింది. అలా చూసినా 2025 దసరాకి కల్కీ 2 మూవీ షూటింగ్ షురూ అవ్వాలి.. అలాంటి ప్రాజెక్ట్ ని 2026 దసరా తర్వాతే ప్లాన్ చేసుకోవాలంటూ నటిసింహం బాలయ్య నుంచి కాల్ వచ్చిందట
ఇండస్ట్రీలో ఇప్పుడిదే హాట్ టాపిక్ గా మారింది. కల్కీ 2 తాలూకు 20 శాతం షూటింగ్ ని మొదటి భాగం తీసేప్పుడే కంప్లీట్ చేశారు. రెండో భాగం వచ్చే ఏడాది ఎండ్ లో మొదలైనా 2026 లో కల్కీ 2 వచ్చే ఛాన్స్ ఉంది. కాని ఆ అవకాశం లేకుండా నటసింహం బాలయ్య సీన్ లోకి రావటమే కాదు, దర్శక నిర్మతలకు ఈ విషయంలో క్లారిటీ ఇచ్చాడు
రెబల్ స్టార్ ప్రభాస్ కి కూడా కాల్ వెళ్లింది. తనని కూడా నటసింహం బాలయ్య రిక్వెస్ట్ చేశాడట. బేసిగ్గా ప్రభాస్ అందరి డార్లింగ్… సీనియర్ స్టార్స్ చెబితే వెంటనే దేనికైనా సై అనే తను, బాలయ్య ప్రపోజల్ ని వెల్ కమ్ చేశాడట. అదే తన దర్శకుడు నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో తన వారసుడిని లాంచ్ చేయాలనే ప్రపోజల్
బాలయ్య పిలవటం ఇండస్ట్రీలో దర్శక నిర్మాతలు రాకపోవటం అంటూ ఉండదు.. తనెప్పుడు ఎవరిని రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. కాని తన వారసుడు మోక్షగ్న విషయంలో తను జాగ్రత్తులు పెంచాడట. హనుమాన్ ఫేం ప్రశాంత్ వర్మ మేకింగ్ లో సింబ ఈజ్ కమ్మింగ్ మూవీని ప్లాన్ చేసినా, మళ్లీ ఆ ప్రాజెక్టుకు కథపరంగా బ్రేకులు పడ్డాయని తెలుస్తోంది
దీనికి తోడు వెంకీ అట్లూరితో ఆదిత్య 369 సీక్వెల్ ఆదిత్య 999ని ప్లాన్ చేశాడు బాలయ్య. చివరికి ఇప్పుడా ప్రాజెక్ట్ నాగ్ అశ్విన్ చేతిలో పెడతాడా? అదికాకుండా కొత్త కథతో తన వారసుడి ప్రాజెక్ట్ ప్లాన్ చేయిస్తున్నాడో తేలతేదు కాని, నాగ్ అశ్విన్ తో మోక్షగ్న మూవీ ఆల్ మోస్ట్ కన్ఫామ్ అయినట్టేనట. వైజయంతీ మూవీస్ బ్యానర్ లోనే నాగ్ అశ్విన్ డైరెక్షన్ లోనే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కేలా ఉంది. ఎలాగూ ప్రభాస్ ఫౌజీ, స్పిరిట్ మూవీలతోనే ఏడాదిన్నర వరకు బిజీ అయ్యే ఛాన్స్ఉంది. ఈలోపు మోక్షగ్న మూవీ ప్లాన్ చేస్తే ఎలా ఉంటుందనే డిస్కర్షన్ లో భాగంగా, దర్శకనిర్మాతలకే కాదు, రెబల్ స్టార్ కి కూడా బాలయ్య నుంచి కాల్ వెల్లినట్టు ప్రచారం జరుగుతోంది. ప్రభాస్ కూడా సీనియర్ నటుడి మాటకు సై అనటంటో, సంక్రాంతికి మోక్షగ్న తో కల్కీ ఫేం నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ ఎనౌన్స్ అవుతుందనే ప్రచారం పెరిగింది.