తనను పవన్ దరిదాపులకు కూడా వెళ్లనివ్వకుండా త్రివిక్రం కాలడ్డుతున్నాడని బండ్ల ఇండరెక్ట్‌గా చాలా కాలం నుంచి చెప్తున్నాడు. ఇక రీసెంట్‌గా గురూజీ అంటూ డైరెక్ట్ ఎటాక్ మొదలు పెట్టాడు. వరుస ట్వీట్లతో ట్విటర్‌ను షేక్ చేశాడు. ఇండస్ట్రీలో త్రివిక్రంను అంతా గురూజీ అంటారు. ఇప్పుడు బండ్ల గణేష్ కూడా గురూజీ అంటూ ట్వీట్ చేయడంతో విషయం అంతా క్లియర్ అయింది. నిర్మాతగా మారాలంటే గురూజీకి కాస్లీ గిఫ్ట్‌లు ఇస్తే చాలు ఏది కావాలన్నా జరగుతుంది అంటూ బండ్ల ట్వీట్ చేశాడు. అంతే కాదు.. గురూజీకి భార్యాభర్తలను, స్నేహితులను, గురుశిష్యులను విడకొట్టడం బాగా వచ్చని ట్వీట్స్ చేశాడు. భగవంతుడికి భక్తుడికి అనుసంధానమైనది అంబికా దర్బార్ బత్తి.. భగవంతుడికి భక్తుడిని దూరం చేసేది గురూజీ దర్బార్ సుత్తి అంటూ త్రివిక్రంపై ట్వీట్ల బాణాలు సంధించారు.
బండ్ల గణేష్ చేసిన ఈ ట్వీట్లపై చాలా న్యూస్ వెబ్‌సైట్లు తమకు నచ్చినట్టుగా వార్తలు రాశాయి. కానీ ఓ వెబ్‌సైట్ పబ్లిష్ చేసిన ఆర్టికల్‌పై బండ్ల గణేష్ ఓ రేంజ్‌లో సీరియస్ అయ్యాడు. తెరవెనక అంతా ఓకేనా బండ్ల గణేశా? అని టైటిల్ పెట్టి.. ఎన్నో అంశాలపై రెండు నాల్కల ధోరణి చూపించాడు బండ్ల గణేశ్. ఇప్పుడు గురూజీ విషయంలో కూడా ఆయన దాదాపు యూటర్న్ తీసుకున్నట్టు కనిపిస్తోంది అంటూ ఆ వెబ్‌సైట్ ఆర్టికల్ పబ్లిష్ చేసింది. ఈ ఆర్టికల్‌ను ట్విటర్‌లో ట్యాగ్ చేసిన బండ్ల గణేష్ గట్టి వార్నింగ్ ఇచ్చాడు. ఆ వెబ్‌సైట్ ఎడిటర్స్‌ను టార్గెట్ చేస్తూ బ్రోకర్స్ అంటూ తీవ్రమైన కామెంట్స్ చేశాడు.
నీలి వార్తలు రాసుకొని, నీలి బతుకులు బతుకుతూ.. దొంగచాటుగా తిరిగే నీకు మా గురించి ఎందుకురా లఫుట్ అంటూ పోస్ట్ చేశాడు. మేము ప్రేమిస్తాం, పూజిస్తాం, ప్రాణం ఇస్తాం, కోపం వస్తే అలుగుతాం. ప్రేమించినప్పుడు, పూజించినప్పుడు అలిగే హక్కు కూడా ఉంటుందిరా అంటూ రాసుకొచ్చాడు. సినిమా వాళ్ళ వార్తలు, సినిమా వాళ్ళ ఇంటర్వ్యూలు లేకపోతే మీకు పబ్బం గడవదంటూ నిప్పులు చెరిగాడు. నిజాయితీగల వాడితో దూరంగా ఉండటానికి ప్రయత్నించు. నీతిగా బతికేవాడి జోలికి రాకండి మాడి మసైపోతారంటూ” అంటూ నానా మాటలు అన్నాడు.
బండ్ల చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇంటర్నెట్‌గా మారింది. ఇంతకాలం గురూజీని నేరుగా టార్గెట్ చేసిన బండ్ల ఇప్పుడు ఈ న్యూస్ రాస్తే ఎందుకు ఇంత సీరియస్ అవుతున్నాడంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మరి కొందరు మాత్రం బండ్లను సపోర్ట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. త్రివిక్రంతో మొదలై న్యూస్ వెబ్‌సైట్ మీదికి వెళ్లిన ఈ వ్యవహారం ఇంకా ఎంత దూరం వెళ్తుందో చూడాలి.