Bandla Ganesh: కొన్ని రోజుల నుంచి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌పై ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ ట్విట్టర్ వేదికగా మాటల యుద్ధం చేస్తున్నాడు. సందర్భం దొరికిన ప్రతీసారీ త్రివిక్రంపై ఆరోపణలు చేస్తూ ట్వీట్లు చేస్తున్నాడు. తనను పవన్ కళ్యాణ్‌కు త్రివిక్రమ్ దూరం చేస్తున్నాడని, పవన్ ఈవెంట్లకు కూడా తనను రానివ్వడంలేదనేది బండ్ల గణేష్ ఆరోపణ. దీనికి సంబంధించిన కాల్ రికార్డింగ్ కూడా అప్పట్లో వైరల్‌గా మారింది.
ఇదే విషయంలో చాలా కాలం నుంచి త్రివిక్రమ్‌పై ఇండైరెక్ట్‌గా ఆరోపణలు చేస్తున్నాడు గణేష్. కానీ ఇప్పుడు మాత్రం ఏకంగా గురూజీ అంటూ ట్వీట్లు చేయడం మొదలపెట్టాడు. త్రివిక్రమ్‌ను ఫ్యాన్స్ గురూజీ అని పిలుచుకుంటారు అనే సంగతి తెలిసిందే. నిన్నటి నుంచి గురూజీ.. గురూజీ అంటూ తెగ ట్వీట్లు చేస్తున్నాడు. “గురూజీని కలిసి కాస్ట్‌లీ గిఫ్ట్ ఇస్తే ఏదైనా జరిగిపోతుంది” అని ఒక ట్వీట్ చేయగా, “భార్యాభర్తల్ని, తండ్రి కొడుకుల్ని, గురుశిష్యుల్ని, ఎవర్నైనా వేరు చేయడం గురూజీ స్పెషాలిటీ” అంటూ మరో ట్వీట్ చేశాడు. “సాగినంత కాలం నా అంత వాడు లేడందురు. సాగకపోతే ఊరక చతికిల పడిపోవదురు. చెప్పడమే నా ధర్మం వినకపోతే నీ ఖర్మం గురూజీ” అంటూ డైరెక్ట్‌గానే త్రివిక్రమ్‌ను టార్గెట్ చేశాడు. మరో ట్వీట్‌లో “భగవంతుడికి, భక్తుడికి అనుసంధానమైనది అంబికా దర్బార్ బత్తి. భగవంతుడికి భక్తుడిని దూరం చేసేది గురూజీ దర్బార్ సుత్తి” అంటూ ట్వీట్ చేశాడు.
బండ్ల గణేష్ చేసిన ట్వీట్లు ఇప్పుడు ట్విట్టర్‌లో వైరల్ అవుతున్నాయి. బండ్ల గణేష్ ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తెగ కామెంట్లు పెడుతున్నారు. కొందరు సపోర్ట్ చేస్తుంటే కొందరు మాత్రం తిడుతున్నారు. త్రివిక్రమ్‌కు, పవన్‌కు మధ్య ఎలాంటి బంధం ఉంటుందో బండ్ల గణేష్‌కు కూడా అంతే ఉంటుంది. అలాంటప్పుడు త్రివిక్రమ్‌ను టార్గెట్ చేసి ఇలా మాట్లాడటం తప్పు అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. ఇంకొందరు మాత్రం బండ్ల గణేష్‌కు సపోర్ట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ నుంచి బండ్ల గణేష్‌ను ఎవరూ వేరు చేయలేరంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వ్యవహారంలో త్రివిక్రమ్ మాత్రం ఇప్పటి వరకూ రెస్పాండ్ కాలేదు. మరి బండ్ల గణేష్ ఈ ట్వీట్స్ ఇలాగే కంటిన్యూ చేస్తాడా లేదా చూడాలి.