Akhil : ప్రభాస్, బన్నీ, ఎన్టీఆర్ బాటలో అఖిల్..

హీరోగా పరిచయం కాకముందు, టాలీవుడ్ కి మరో స్టార్ వస్తున్నాడు అనిపించుకున్నాడు అక్కినేని అఖిల్. కానీ హీరోగా ఎంట్రీ ఇచ్చిన తరువాత మాత్రం, ఆ అంచనాలను అందుకోలేకపోతున్నాడు.

 

 

హీరోగా పరిచయం కాకముందు, టాలీవుడ్ కి మరో స్టార్ వస్తున్నాడు అనిపించుకున్నాడు అక్కినేని అఖిల్. కానీ హీరోగా ఎంట్రీ ఇచ్చిన తరువాత మాత్రం, ఆ అంచనాలను అందుకోలేకపోతున్నాడు. 2015 లో వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ‘అఖిల్’ సినిమాతో హీరోగా పరిచయమైన ఈ అక్కినేని యంగ్ హీరో.. ‘హలో’, ‘మిస్టర్ మజ్ను’, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్’, ‘ఏజెంట్’ సినిమాలు చేశాడు. వీటిలో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్’ మాత్రమే బాక్సాఫీస్ దగ్గర హిట్ గా నిలిచింది. ఇక గత చిత్రం ‘ఏజెంట్’ భారీ డిజాస్టర్ ను మూటగట్టకుంది. ఈ సినిమా వచ్చి ఏడాది దాటిపోయింది. అఖిల్ ఇంతవరకు తన నెక్స్ట్ మూవీని ప్రకటించలేదు. దీంతో అఖిల్ ఎందుకిలా సైలెంట్ అయిపోయాడని అక్కినేని అభిమానులు ఫీలవుతున్నారు.

అయితే అఖిల్ సైలెంట్ గా ఉండి ఉండి.. ఒకేసారి పెద్ద సంచలనం సృష్టించాలని చూస్తున్నాడని తెలుస్తోంది. అఖిల్ తన తదుపరి చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో చేయనున్నాడు. భారీ బడ్జెట్ తో రూపొందనున్న ఈ చిత్రంతో ‘సాహో’కి దర్శకత్వ శాఖలో పని చేసిన అనిల్, డైరెక్టర్ గా పరిచయమవుతున్నాడు. ఈ చిత్రానికి ‘ధీర’ అనే పవర్ ఫుల్ టైటిల్ ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. రూ.100 కోట్లకు పైగా బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా రూపొందనున్న ఈ సినిమా కోసం.. సౌత్ నుంచి, నార్త్ నుంచి పలువురు స్టార్స్ ని రంగంలోకి దింపబోతున్నట్లు వినికిడి. అంతేకాదు ఈ మూవీకి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది.

అదేంటంటే, ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కనుందట. కొన్నేళ్లుగా భారీ బడ్జెట్ తో రూపొందుతోన్న పాన్ ఇండియా సినిమాలు రెండు భాగాలుగా వస్తున్నాయి. ప్రభాస్ ‘బాహుబలి’, ‘సలార్’, ‘కల్కి’, అల్లు అర్జున్ ‘పుష్ప’, ఎన్టీఆర్ ‘దేవర’ ఆ కోవలోకే వస్తాయి. ఇప్పుడు అఖిల్ మూవీ కూడా అదే బాటలో పయనించనుంది అంటున్నారు. ఈ ధీర’ ప్రాజెక్ట్ పట్ల మేకర్స్ ఎంతో కాన్ఫిడెంట్ గా ఉన్నారని, ఈ సినిమా అఖిల్ కి అసలుసిసలైన పాన్ ఇండియా లాంచ్ లా ఉంటుందని చెబుతున్నారు.