బిగ్‌బాస్‌ కోసం బేబక్క రూ.కోటి ఉద్యోగం త్యాగం

బెజవాడ బేబక్క. మొన్నటి వరకూ ఇన్‌స్టాగ్రామ్‌కు మాత్రమే పరిమితమైన ఈమె పేరు.. బిగ్‌బాస్‌ ఎంట్రీతో ఇప్పుడు తెలుగు స్టేట్స్‌లోని ప్రజలకు సుపరిచితమైంది. హౌజ్‌లోకి వళ్లిన వారం రోజుల్లోనే ఎలిమినేట్‌ అయ్యి బయటికి వచ్చేసింది బేబక్క.

  • Written By:
  • Publish Date - September 11, 2024 / 03:48 PM IST

బెజవాడ బేబక్క. మొన్నటి వరకూ ఇన్‌స్టాగ్రామ్‌కు మాత్రమే పరిమితమైన ఈమె పేరు.. బిగ్‌బాస్‌ ఎంట్రీతో ఇప్పుడు తెలుగు స్టేట్స్‌లోని ప్రజలకు సుపరిచితమైంది. హౌజ్‌లోకి వళ్లిన వారం రోజుల్లోనే ఎలిమినేట్‌ అయ్యి బయటికి వచ్చేసింది బేబక్క. వచ్చిన తరువాత వరుస ఇంటర్వ్యూలతో తన జీవితం గురించి చాలా విషయాలను ప్రేక్షకులతో పంచుకుంటోంది. బెజవాడ బేబక్కగా అందరికీ సుపరిచతమైన బేబక్క అసలు పేరు మధు. ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్‌ చేస్తూ కామెడీ వీడియోలు చేస్తూ ఫేమస్‌ అయ్యింది. బేబక్క మంచి సింగర్‌ కూడా. ఆమె చేసే రీల్స్‌ ఫన్నీగా ఉన్నా.. ఆమె బ్యాగ్రౌండ్‌ మాత్రం చాలా గట్టిగానే ఉంది.

విజయవాడకు చెందిన బేబక్క స్కూలింగ్‌ మొత్తం విజయవాడలోనే కంప్లీట్‌ చేసింది. ఎంబీఏలో యూనివర్సిటీ టాపర్‌ కూడా. వేరే కాలేజీల్లో లెక్చురర్‌గా పని చేసేందుకు బేబక్కకు చాలా ఆఫర్స్‌ కూడా వచ్చాయట. కానీ అమెరికాలో మంచి ఉద్యోగం రావడంతో అమెరికా వెళ్లిపోయిందట బేబక్క. అక్కడే దాదాపు పదేళ్లు ఉద్యోగం చేసిందట. టెస్ట్‌ లీడ్‌గా బేబక్క ఉద్యోగం చేస్తున్న సమయంలో వాళ్ల టీంలో అందరికంటే ఆమే చిన్నదట. అయినప్పటికీ ఆమెకు ఉన్న టాలెంట్‌తో అందరికంటే ఎక్కువ ప్యాకేజీ సొంతం చేసుకుందట. జాబ్‌ చేస్తున్న టైంలో బేబక్క ప్యాకేజ్‌ సంవత్సరానికి కోటి రూపాయలు. దాదాపు పదేళ్లు అమెరికాలో ఉద్యోగం చేసి కావాలసినంతా సంపాదించుకుందట.

ఎంత మంచి ఉద్యోగం ఐనా ప్యాషన్‌ ముందు ఓడిపోయింది ఆ ఉద్యోగం. బేబక్కకు సింగింగ్‌ యాక్టింగ్‌ అంటే చాలా ఇష్టం. స్టార్‌గా గుర్తింపు తెచ్చుకోవాలని ఆరాటం. ఆ కారణంగానే కొన్నేళ్ల క్రితం జాబ్‌ వదిలేసి మరీ ఇండియాకు వచ్చేసింది. సినీ ఇండస్ట్రీ మీద ఉన్న ఇష్టంతోనే బిగ్‌బాస్‌లో అవకాశం రాగానే వెళ్లిపోయానంటోంది బేబక్క. కానీ వారం రోజుల్లోనే తాను ఎలిమినేట్‌ అయ్యి వచ్చేస్తానని కలలో కూడా అనుకోలేదని చెప్తోంది. రీల్స్‌లో ఎంతో కామెడీగా కనిపించే బేబక్కకు ఈ రేంజ్‌ బ్యాగ్రౌండ్‌ ఉందా అని అంతా ఆశ్చర్యపోతున్నారు. ప్యాషన్‌ కోసం కోటి రూపాయల ఉద్యోగం కూడా వదిలేసి వచ్చేసిందని తెలిసి అంతా షాకౌతున్నారు.