Satyabhama Review : భామే కానీ సత్యభామ కాదు…!

కాజల్ అగర్వాల్ సీరియస్ పోలీస్ గా కుమ్మేసింది. స్ట్రాంగ్ ఇండిపెండెంట్ ఉమెన్ గా కనిపించిన తీరు ఆకట్టుకుంది. ఫైట్స్ చేసినా ఆమె లో కసి కనిపించలేదు. హసీనాగా నటించిన నేహా పఠాన్ సినిమా మొత్తం లో కనిపించిన ఆమెను ఎందుకు పెట్టారో అర్థంకాదు.

ఇంట్రో..
సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన కాజల్ అగర్వాల్ తన కెరీర్లో నటించిన మొట్టమొదటి ఫియల్ ఓరియెంటెడ్ మూవీ సత్యభామ. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులని ఏ మేరకు అలరించిందో రివ్యూ చూద్దాం.

స్టోరీ లైన్…
మరో రెండు గంటల్లో పెళ్లి అనగా.. ఒక కేస్ ఇన్వెస్టిగేషన్ కోసం పోలీస్ స్టేషన్ వచ్చిన సత్యభామ ను పోలీస్ స్టేషన్ లో కలుస్తుంది హసీనా . ఆమె ప్రియుడు యేదు తనను హింసిస్తున్నాడని.. అతడి నుండి కాపాడమని వేడుకుంటుంది. స్త్రీ హింసను సీరియస్ గా తీసుకున్న సత్యభామ.. యేదుకు గట్టి వార్నింగ్ ఇస్తుంది. కట్ చేస్తే.. హసీనాను దారుణంగా హత్య చేసి మాయమవుతాడు యేదు. అతడ్ని పట్టుకోవడంలో నిమగ్నమైన సత్యభామకు కొన్ని నమ్మలేని నిజాలు తెలుస్తాయి. ఆ కేస్ ఇన్వెస్టిగేషన్ లో అనుకోని విధంగా పొలిటీషియన్స్ & పోలీసులు ఇన్వాల్వ్ అవుతారు. అసలు యేదు ఎక్కడ దాక్కున్నాడు.. ఎందుకని సత్యభామకు అతడ్ని పట్టుకోవడం అసాధ్యమైంది.. హసీనా కథలో ఉన్నపళంగా అన్ని మలుపులు ఎందుకొచ్చాయి.. వంటి ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

పర్పామెన్స్…
కాజల్ అగర్వాల్ సీరియస్ పోలీస్ గా కుమ్మేసింది. స్ట్రాంగ్ ఇండిపెండెంట్ ఉమెన్ గా కనిపించిన తీరు ఆకట్టుకుంది. ఫైట్స్ చేసినా ఆమె లో కసి కనిపించలేదు. హసీనాగా నటించిన నేహా పఠాన్ సినిమా మొత్తం లో కనిపించిన ఆమెను ఎందుకు పెట్టారో అర్థంకాదు. ఇక ప్రజ్వల్ యడ్మ మరో కీలకపాత్రలో ఆశ్చర్యపరిచాడు. అనిరుధ్ పవిత్రన్, అంకిత్ కొయ్య , హర్షవర్ధన్ లు తమ పాత్రలతో న్యాయం చేశారు.

టెక్నికల్ విషయానికి వస్తే…
దర్శకుడు సుమన్ చిక్కాల రాసుకున్న ములకథలో ఉన్న దమ్ము.. కథనంలో లోపించింది. అందువల్ల.. ఎంతో ఆసక్తికరంగా సాగాల్సిన కథనం, మధ్యలో ఎక్కడో తేడా కొట్టింది. స్క్రీన్ ప్లే విషయంలో చేసిన కొన్ని ప్రయోగాలు, మెయిన్ ప్లాట్ ను సస్టైన్ చేయడం కోసం క్రియేట్ చేసిన సబ్ ప్లాట్స్ గట్రా.. ఎక్కువ స్పేస్ తీసుకొని మెయిన్ పాయింట్ & ట్విస్ట్ ను ఆడియన్స్ ఎంజాయ్ చేయకుండా చేశాయి. అయితే.. థ్రిల్లింగ్ కిక్ ఇవ్వలేకపోయాడు కానీ.. ఓ మోస్తరుగా ఆకట్టుకోవడానికి ప్రయత్నించి.. కొంతమేరకు విజయం సాధించాడు సుమన్ చిక్కాల. చరణ్ పాకాల మ్యూజిక్ పర్వాలేదనిపించింది. విష్ణు సినిమాటోగ్రఫీ, పవన్ కల్యాణ్ ఎడిటింగ్ వర్క్ కూడా సినిమాకి ప్లస్ పాయింట్స్. ప్రొడక్షన్ డిజైన్ & ఆర్ట్ డిపార్టుమెంట్ సినిమాను రిచ్ గా చూపించడానికి కష్టపడ్డారు.

ఓవరాల్ గా… ఇన్నాళ్లు తన గ్లామర్ తో మెస్మరైజ్ చేసిన కాజల్… యాక్షన్ మోడ్ లో ఎలా ఉంటుందో చూడాలనుకుంటున్న వారు అయిన ఈ సినిమాని థియేటర్లో చూడాల్సిందే.